NTV Telugu Site icon

Ustaad Bhagat Singh: ఉస్తాద్ టీజర్‌పై పూనమ్ కౌర్ ఆసక్తికర కామెంట్స్

Poonam

Poonam

Poonam Kaur Comments on Ustaad Bhagat Singh Teaseer: పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. కొంత షూట్ జరుపుకున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ టీజర్ రిలీజ్ అవుతుందని ముందే లీకులు వచ్చాయి. పవన్ జనసేన పొలిటికల్ జర్నీకి ఉపయోగపడేలా ఆ టీజర్ ఉంటుందని అంటే నిజంగానే జనసేన గుర్తు గాజు గ్లాసును హైలైట్ చేస్తూ ఈ డైలాగ్ టీజర్ కట్ చేశారు. ఇక తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ ఒకటి ముంబైలో జరుగుతున్న క్రమంలో ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.

Manjummel Boys: తొలి ‘200 కోట్ల’ మలయాళ సినిమాగా చరిత్ర సృష్టించిన ‘మంజుమ్మేల్ బాయ్స్’

ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ టీజర్ గురించి వివాదాస్పద నటి పూనమ్ కౌర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ మధ్యన ఎక్కువగా సోషల్ మీడియాలో వివాదాలతోనే వార్తల్లో నిలుస్తోంది. నిన్న మొన్నటి వరకు గురూజీ అంటూ త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ వచ్చినా ఆమె ఈసారి ఏకంగా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీజర్ మీద కామెంట్ చేసింది. అయితే ఎక్కడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకు రాకుండా ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసింది ఆమె. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుందని అంటూనే నువ్వు లేకుండా ఒక కమర్షియల్ సినిమా అసంపూర్ణం, నీకు అవకాశం దొరికింది కదా మరోసారి రాక్ చేయి అని అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Show comments