Site icon NTV Telugu

PoojaHegde : మరోసారి అక్కినేని హీరోతో బుట్టబొమ్మ రొమాన్స్

Pooja-Hegde

బుట్టబొమ్మ పూజాహెగ్డే వరుస సినిమాలలో స్టార్ హీరోలతో జత కడుతూ నెంబర్ వన్ హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. ప్రభాస్ సరసన ఆమె నటించిన “రాధేశ్యామ్” విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘బీస్ట్’ అంటూ తమిళ స్టార్ విజయ్ తో జోడి కడుతోంది. తాజాగా ఈ బ్యూటీకి మరోసారి అక్కినేని వారసుడితో జతకట్టే ఛాన్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు విన్పిస్తోంది. వెంకట్ ప్రభు తాను రాసుకున్న కథలో మహిళా ప్రధాన పాత్రకు పూజ సరిగ్గా సరిపోతుందని భావించారట. అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం స్టార్ బ్యూటీని ఎంపిక చేయాలనుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్.

Read Also : Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత

పూజా, నాగ చైతన్య గతంలో “ఒక లైలా కోసం” అనే చిత్రంలో జంటగా నటించారు. ఈ సినిమాతోనే పూజాహెగ్డే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి వారు జోడిగా రాబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇటీవలే పూజా మరో అక్కినేని వారసుడు అఖిల్ తో కలిసి “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ప్రేక్షకులను అలరించింది.

Exit mobile version