Site icon NTV Telugu

Pooja Hegde: ఫ్లైట్ లో అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు

Pooja

Pooja

బుట్టబొమ్మ పూజా హెగ్డే కు చేదు అనుభవం ఎదురైంది.. విమాన సిబ్బందిలో ఒకరు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో వస్తున్న ఆమెపై విపుల్‌ నకాషే అనే ఉద్యోగి రూడ్ గా బిహేవ్ చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడినట్లు పూజా తెలిపింది. “ఇండిగో విమాన సిబ్బంది ఇంత అసభ్యంగా ప్రవర్తించినందుకు విచారంగా ఉంది. గురువారం ముంబై నుంచి వస్తున్న ఫ్లైట్‌లో విపుల్‌ నకాషే అనే ఉద్యోగి చాలా రూడ్ గా ప్రవర్తించాడు. కారణం లేకుండా మాపై అరిచాడు. తన అహంకారాన్ని చూపించాడు. సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ట్వీట్‌ చేయను కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో నాకు చాలా భయమేసింది” అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పూజకు ఇండిగో యాజమాన్యం క్షమాపణలు కోరింది. ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది. ఇక పూజా కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం అమ్మడు విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమణ’ చిత్రంలో నటిస్తోంది.

Exit mobile version