Site icon NTV Telugu

Pooja Hegde: పూజా హెగ్డేకి షాక్.. చంపేస్తామని బెదిరింపులు?

Pooja Hegde

Pooja Hegde

Pooja Hegde Received Death Threats: నటి పూజా హెగ్డేకి సంబంధించిన ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. అవును, పూజా హెగ్డేని చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దుబాయ్‌లో తీవ్రమైన వాదనలు తర్వాత పూజా హెగ్డేకి హత్య బెదిరింపులు వచ్చినట్లు ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. వైరల్ భయానీ పోస్ట్ ప్రకారం, పూజా ఒక క్లబ్ ప్రారంభోత్సవం కోసం అక్కడికి వెళ్ళింది, కానీ ఇప్పుడు ఈ బెదిరింపుల అనంతరం భారత దేశానికి తిరిగి వచ్చిందని అంటున్నార. అయితే అసలు ఏమి జరిగింది అనే విషయం మీద పూజా హెగ్డే టీమ్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ పోస్ట్ పెట్టిన కొంత సమయానికే డిలీట్ చేశారు.

Most Viral Videos 2023 : 2023 లో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయిన వీడియోలు ఇవే..

ఇక పూజా హెగ్డే చేస్తున్న సినిమాల విషయానికి వస్తే చివరి సారిగా సల్మాన్ ఖాన్‌తో కలిసి కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌లో కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. తెలుగులో ఆమెకు సినిమాలు లేవు కానీ ఇప్పుడు షాహిద్ కపూర్‌తో దేవా అనే రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో నటించనుంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సిద్ధార్థ్ రాయ్ కపూర్ – జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version