NTV Telugu Site icon

Pooja Hegde: క్రికెటర్ ప్రేమలో పూజా.. మరి ఆ డైరెక్టర్ పరిస్థితి ఏంటి.. ?

Pooja

Pooja

Pooja Hegde: బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రేమలో పడిందా.. ? అంటే .. నిజమే అని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. గత రెండేళ్లు గా పూజాకు హిట్ అందుకుంది లేదు. ఇక పూజా కెరీర్ ఫినిష్ అని కొందరు.. ? పూజా కమ్ బ్యాక్ ఎప్పుడు ఇస్తుందో అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒక ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఈ మధ్యనే గుంటూరు కారం చిత్రం నుంచి బయటకు రావడంతో మంచి ఛాన్స్ ను మిస్ చేసుకుంది. ఇక ఆ చిత్రంలోనే ఈ భామ ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమాలు చేయకపోయినా కూడా సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతతో కుర్రకారుకు దగ్గరగానే ఉంటుంది. గతకొన్నిరోజులుగా పూజా .. ఒక క్రికెటర్ ప్రేమలో ఉందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.

Suman: చంద్రబాబు అరెస్ట్ పై సుమన్ కీలక వ్యాఖ్యలు

ఇక దీంతో పూజా ప్రేమలో పడిందంటూ నెటిజన్స్ సైతం నమ్మేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఒక డైరెక్టర్ తో పూజా.. క్లోజ్ గా ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు పూజా క్రికెటర్ తో ప్రేమలో పడితే డైరెక్టర్ పరిస్థితి ఏంటో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో పూజాకు ఇది మరో పెద్ద దెబ్బ అని చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే .. ప్రస్తుతం పూజా కెరీర్ ను చక్కదిద్దుకునే సమయంలో ఇలాంటి రూమర్స్ మంచిది కాదని కొందరు చెప్పుకొస్తున్నారు.