Site icon NTV Telugu

“భవదీయుడు భగత్ సింగ్”కు జోడిగా బుట్టబొమ్మ?

Pooja Hegde likely to play the female lead in Bhavadeeyudu Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పవన్ కళ్యాణ్ స్టైలిష్, యంగ్ లుక్‌లో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఈసారి ఇది కేవలం వినోదం మాత్రమే కాదు’ అంటూ పోస్టర్ పై ఉన్న ట్యాగ్‌లైన్ మెగా ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపింది. ఇక టైటిల్ ప్రకటించింది మొదలు సినిమాపై పలు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోంది అంటున్నారు. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ లో కన్పించిన ఇండియా గేట్ కూడా ఆ రూమర్లకు కారణమైంది. అంతేకాకుండా పవన్ రీఎంట్రీ తరువాత చేస్తున్న సినిమాలు పొలిటికల్ రూట్ మ్యాప్ గానే అన్పిస్తున్నాయి.

Read also : “లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?

ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ సరసన నటించబోయే హీరోయిన్ విషయమై చర్చ మొదలైంది. ఇందులో పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే అవకాశాలు బుట్టబొమ్మకు ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే, గద్దల కొండ గణేష్ సినిమాలలో పూజా హెగ్డే నటించింది. ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ దర్శకుడి సినిమాలో పూజా కనిపించబోతోంది అని సమాచారం. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురు చూడాల్సిందే. ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఎడిటింగ్ చోటా కె ప్రసాద్.

Exit mobile version