Site icon NTV Telugu

Pooja Hegde: అసలు క్యారవాన్ న్యూస్ ఎక్కడ పుట్టింది? ఎవరు పుట్టించారు?

Pooja Hegde

Pooja Hegde

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, కొన్ని వెబ్ పోర్టల్స్‌లో నటి పూజా హెగ్డే క్యారవాన్ అంటూ ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది, ఒక స్టార్ హీరోకు పూజకు మధ్య ఏదో వివాదం జరిగిందని, దాని ఫలితంగానే క్యారవాన్ దగ్గర గొడవ జరిగిందనే కథనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజమెంత? దీని వెనుక ఉన్న అసలు అజెండా ఏమిటి? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు నటి పూజా హెగ్డే కానీ, సదరు స్టార్ హీరో కానీ ఎక్కడా చిన్న ప్రకటన కూడా చేయలేదు, ఈ వార్త ఒక ‘గాసిప్ ఎక్స్ అకౌంట్’ నుండి పుట్టింది. ఎటువంటి ఆధారాలు లేని వార్తలను వండి వడ్డించడంలో ఒకప్పుడు గాసిప్ వెబ్‌సైట్లు ఉండేవి, కానీ ఇప్పుడు ఆ వెబ్ సైట్స్ స్థానాన్ని కొన్ని ఎక్స్ అకౌంట్స్ భర్తీ చేస్తున్నాయి. కేవలం ఫాలోవర్స్, వ్యూస్ కోసం రాసిన ఓ అనామక నేరేషన్ పట్టుకుని, అది నిజమని నమ్మేయడం ఎంతవరకు సమంజసం అన్నది విశ్లేషకుల ప్రశ్న.

Also Read :Renu Desai: జడ్జిని కుక్క ఏదో చేసి ఉంటుంది… రేణు దేశాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు

పూజా హెగ్డే చెప్పినట్టుగా తన క్యారవాన్లోకి ఒక స్టార్ట్ హీరో అనుమతి లేకుండా రావడంతో కోపంతో చెంప పగుల కొట్టానని, దీంతో అప్సెట్ అయి వెళ్ళిపోయిన హీరో ఆ పాన్ ఇండియా సినిమాలో తన తప్పించి తన డూప్ చేత మిగిలిన సీన్స్ చేయించారని ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్ద విషయాన్ని చెప్పాలనుకుంటే పూజా హెగ్డే నేరుగా ఏదైనా వీడియో ఇంటర్వ్యూలో కానీ లేదా ఒక పేరు ఉన్న సంస్థకు ఇచ్చే వాయిస్ ఇంటర్వ్యూలో గాని చెబుతుంది కానీ ఒక ఎక్స్ అకౌంట్కి ఎందుకు జరుగుతుందనేది ఆలోచించాల్సిన విషయం. ఈ వ్యవహారంలో అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఒక వర్గం యాంటీ ఫ్యాన్స్ ఈ అబద్ధపు వార్తను భుజాన వేసుకుని తమ యాంటీ హీరోకి అంతగడుతూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సదరు స్టార్ హీరో ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ‘నెగటివ్ పిఆర్’ నడుస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. కావాలనే కొంతమంది ఒక పద్ధతి ప్రకారం హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగిస్తూ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. అసలు గొడవ జరిగిందా లేదా అన్న ప్రాథమిక విషయం పక్కన పెట్టి, కావాలని ఒక హీరో క్యారెక్టర్‌ను కించపరిచేలా పోస్టులు
పెట్టడం వెనుక బలమైన కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :Gautam Gambhir Trolls: గంభీర్‌ సర్.. ఇక మీ సేవలు చాలు!

సినీ పరిశ్రమలో ఒకరి ఇమేజ్‌ను పెంచడానికి లేదా తగ్గించడానికి ‘పిఆర్ ఏజెన్సీలను’ వాడటం కొత్తేమీ కాదు కానీ, ఇలాంటి రూమర్లను సృష్టించి ఒక హీరో మీద లేనిపోని ఆరోపణలు రుద్దడం అనైతికం. పూజా హెగ్డే లాంటి బిజీ నటి తన వృత్తిపరమైన పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆమె పేరును వాడుకుంటూ హీరోలపై బురద చల్లడం కేవలం అజెండాలో భాగమే తప్ప మరేమీ కాదు. అనామక వెబ్‌సైట్ల కథనాలను, ఎక్స్ పోస్ట్ లను ఆధారంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి (Character Assassination) పాల్పడటం సరైన పద్ధతి కాద, అభిమానం ఉండొచ్చు కానీ, అది వేరొకరిని అకారణంగా ద్వేషించే స్థాయికి చేరకూడదు.

Exit mobile version