Site icon NTV Telugu

Pooja Hegde: పూజా హెగ్డే కౌంటర్.. అతనికి లీగల్ నోటీసులు

Pooja Hegde Legal Notices

Pooja Hegde Legal Notices

Pooja Hegde And Kriti Sanon Sends Legal Notice To Umair Sandhu: అవును, అందరికీ భావా ప్రకటన స్వేచ్ఛ ఉంది. తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగని.. నోటికొచ్చినట్లు మాత్రం మాట్లాడకూడదు. ఏం మాట్లాడినా ఒక హద్దు వరకే ఉండాలి. ఇతరుల ఫీలింగ్స్ దెబ్బతినే స్థాయిలో ఉండకూడదు. ఒకవేళ ఆ హద్దు దాటితే మాత్రం.. తప్పకుండా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు ఉమైర్ సంధుకి కూడా సినీ తారల నుంచి వరుసగా మొట్టికాయలు పడుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా అతడు చేస్తున్న ఆరోపణలతో నొచ్చుకుంటున్న సినీతారలు, అతనికి తమదైన శైలిలో బుద్ధి చెప్పేందుకు ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా పూజా హెగ్డే అతనికి లీగల్ నోటీసులు పంపించింది.

Sri Sudha: నటి శ్రీసుధకి విమానంలో చేదు అనుభవం.. ఆకతాయి అక్కడ కాళ్లు వేసి..

తనని తాను ఓవర్సీస్ రివ్యూవర్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు.. మొదట్లో తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా ప్రతి సినిమాకి రివ్యూ ఇచ్చేవాడు. అది కూడా రిలీజ్ కాకముందే. వాటి ద్వారానే అతడు నెట్టింట్లో కొంత ఫేమస్ అయ్యాడు. అయితే.. ఈమధ్య అతడు ఓవరాక్షన్ చేయడం మొదలుపెట్టాడు. సినీ తారలపై నిరాధారోపణలు చేయడం మొదలుపెట్టాడు. ఫలానా హీరో ఓ హీరోయిన్‌కి టార్చర్ పెట్టాడని, ఇంకా ఎఫైర్లు నడుపుతున్నారంటూ కాకమ్మ కథలు చెప్తూ వస్తున్నాడు. అతడు చేస్తున్న ఈ ఆరోపణలు నటీనటులు అప్పటికప్పుడే గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇలాంటి బతుకు బతకడం కన్నా.. ఏదైనా పనికొచ్చే పనిచూసుకో అంటూ ఎదురుదాడులకు దిగారు. అయినా.. అతనిలో మార్పు రాకపోగా, ఇంకా రెచ్చిపోతున్నాడు.

Driving Fine: డ్రైవింగ్ చేస్తూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే.. రూ. 20,000 జరిమానా

ఇప్పుడు తాజాగా ఉమైర్ సంధు ట్విటర్ మాధ్యమంగా పూజా హెగ్డేపై ఓ సంచలన ట్వీట్ చేశాడు. ఇప్పుడు పూజా చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయని, ఆమె ఐరన్‌లెగ్‌గా మారిందంటూ ట్వీట్స్ చేశాడు. అలాగే.. కృతి సనన్‌ని ప్రభాస్ ప్రపోజ్ చేశాడని, త్వరలోనే ఈ వ్యవహారం వెలుగులోకి వస్తుందని కామెంట్లు చేశాడు. దీంతో కోపాద్రిక్తులైన ఆ ఇద్దరు భామలు.. అతనికి లీగల్ నోటీసులు పంపించారు. అయితే.. ఇక్కడో చిన్న తిరకాసు ఉంది. ప్రస్తుతం అతడు లండన్‌లో ఉన్నాడు. కాబట్టి, అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి కుదరదు. అందుకే.. ఆ ఇద్దరు హీరోయిన్ల పంపిన నోటీసులపై కూడా అతడు ట్వీట్స్ పెట్టి, కామెడీ చేస్తున్నాడు.

Exit mobile version