NTV Telugu Site icon

Pooja Bhatt: తండ్రితో లిప్ లాక్.. సిగ్గులేదు.. హీరోయిన్ ఏమన్నదంటే ..?

Pooja

Pooja

Pooja Bhatt: బాలీవుడ్ ఇండస్ట్రీలో భట్ ఫ్యామిలీలు చాలా ఎక్కువ. ఇక నిర్మాత మహేష్ భట్ గురించి కూడా జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక మహేష్ భట్ ముద్దుల తనయగా పూజా భట్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఒకానొక సమయంలో ఆమె మంచి విజయాలను అందుకొని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఆ సమయంలోనే ఆమె చేసిన ఒక తప్పు.. సినిమాల కంటే ఎక్కువ పేరును తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడంటే.. పిల్లలు, పెద్దలు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు.. ఇలా వరసలు లేకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు కానీ, ఒకప్పుడు తండ్రి దగ్గరకు పదేళ్లు దాటిన కూతురు వెళ్ళడానికి కూడా పెద్దవారు అంగీకరించేవారు కాదు. తండ్రి ఒడిలో కూర్చోవడానికి కానీ, అన్నదమ్ములతో కలిసిమెలిసి ఆదుకోవడానికి కానీ అనుమతించేవారు కాదు.

RGV: ఏపీ ప్రజలపై ఆర్జీవీ ఫైర్.. వెన్నుపోటు పొడుస్తున్నారు అంటూ..

ఇక అలాంటి సమయంలోనే పూజా భట్.. ఏకంగా తండ్రికి లిప్ కిస్ పెట్టి సెన్సేషన్ సృష్టించింది. అప్పట్లో ఈ ఫోటో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఛీఛీ సిగ్గులేదు.. తండ్రితో ఇలాంటి ఫోటోలు.. ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా.. ? భారతదేశంలో పుట్టి.. ఏంటి ఇలాంటి చెండాలం.. వావీవరుసలు లేవా అంటూ పూజా, మహేష్ లపై ప్రజలు విరుచుకుపడ్డారు. ఇక తాజాగా ఈ విషయమై దాదాపు 30 ఏళ్ల తరువాత పూజా భట్ ఓపెన్ అయ్యింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె దీని గురించి మాట్లాడుతూ.. “తండ్రితో ఇలా లిప్ కిస్ ఏంటి అని అప్పట్లో నాపై ఎన్నో విమర్శలు చేశారు. పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయినా.. తల్లిదండ్రులకు చిన్నపిల్లలే. అలానే చిన్నపిల్లగా అనుకోని నేను ఆయనకు ముద్దుపెట్టాను. అలా చేసినందుకు నన్ను చాలామంది విమర్శించారు. వాటిని నేనెప్పుడూ పట్టించుకోలేదు. షారుఖ్ నాకు ఆ సమయంలో ఎంతో సపోర్ట్ గా నిలిచాడు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments