ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రాల్లో.. 2016లో అమీర్ ఖాన్ నటించిన బాలీవుడ్ మూవీ ‘దంగల్’.. రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2.. 1800 కోట్లకు పైగా రాబట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. 2017లో వచ్చిన బాహుబలి 2 తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటడమే కాదు.. పాన్ ఇండియా సినిమాలకు పునాదిగా నిలిచి.. ఇండియన్ సినిమాని ఒక్కతాటిపైకి తీసుకొచ్చింది. అలాగే అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమాను కొట్టే మూవీ మరోటి రాలేదు. మొదట్లో ఆర్‌ఆర్‌ఆర్, కెజియఫ్2 చిత్రాలు ఆ దిశగా అడుగులేసినా.. బాహుబలి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. కానీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ఈ చిత్రాలు నిలిచాయి. అయితే ఈ వెయ్యి కోట్ల క్లబ్‌లో వరుసగా మూడు చిత్రాలు మన దక్షిణాదివే కావడం విశేషం.
ఇక ఇప్పుడు ఇదే జాబితాలో మరో సౌత్ ఇండియన్ మూవీ కూడా చేరబోతోందని తమిళ సినీ వర్గాలంటున్నాయి. అంతేకాదు.. ఏకంగా బాహుబలి 2 రికార్డులు బద్దలు కొడుతుందని.. మణిరత్నం లేటెస్ట్ ఫిల్మ్ పొన్నియన్ సెల్వన్ పై అంచనాలను పెంచేస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా.. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1’ని సెప్టెంబర్ 30న.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష వంటి భారీ స్టార్ క్యాస్టింగ్‌తో ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ మణిరత్నం స్టైల్లో భారీ విజువల్ వండర్‌గా ఉండడంతో.. ఇక బాహుబలి రికార్డ్స్ గల్లంతేనని కామెంట్స్ చేస్తున్నారు తమిళ తంబీలు. దాంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బాహుబలి వర్సెస్ పొన్నియన్ సెల్వన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో.. నిజంగానే పొన్నియన్ సెల్వన్‌కు అంతా సత్తా ఉందా.. బాక్సాఫీస్ దగ్గర మణిరత్నం మ్యాజిక్ చేస్తాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.
