స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియన్ సెల్వన్’ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ల తరువాత మణిరత్నం డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా భారీ క్యాస్టింగ్‌తో రూపొందుతోంది.. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా పార్ట్1ను సెప్టెంబర్ 30న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే విక్రమ్, కార్తి, ఐశ్వర్య, త్రిష్ ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ.. సినిమా పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఇక ఈ టీజర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు వాళ్లకు థ్యాంక్యూ చెబుతూ.. ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. జులై 8న సాయంత్రం 6 గంటలకు.. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు.. పొన్నియన్ సెల్వన్-1 టీజర్‌ను లాంచ్ చేయనున్నారు. ఇక తమిళ్‌లో స్టార్ హీరో సూర్య చేతుల మీదుగా టీజర్ రిలీజ్ కాబోతోంది. అలాగే మలయాళ టీజర్‌ను మోహన్ లాల్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి.. హిందీ టీజర్‌ను అమితాబ్ బచ్చన్ రిలీజ్ చేయనున్నారు. దాంతో పొన్నియన్ టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇక దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి.. ఏఆర్ రెహ్మమాన్ సంగీతం అందిస్తున్నారు. దాంతో ఈ చిత్రం అన్ని భాషల ఆడియో హక్కులను.. ప్రముఖ ఆడియో సంస్థ టిప్స్ మ్యూజిక్ సొంతం చేసుకుంది. అందుకోసం టిప్స్ మ్యూజిక్ దాదాపు 24 కోట్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న పొన్నియన్ సెల్వన్ పార్ట్1 ఎలా ఉంటుందో చూడాలి.
