Site icon NTV Telugu

Mani Ratnam: త్వరలో ‘పొన్నియన్ సెల్వన్’ అప్ డేట్!

Ponniyan Selvan Release Dat

Ponniyan Selvan Release Dat

ఏస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్‌ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ‘పీయస్‌-1’ని ప్రపంచవ్యాప్తంగా తమిళ, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్‌ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విక్రమ్‌, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్‌, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్‌, ప్రభు, పార్తిబన్‌, ప్రకాష్‌రాజ్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 1950 ల్లో వచ్చిన తమిళ నవల ‘కల్కి’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

పదో శతాబ్దానికి చెందిన సాహసోపేతమైన అంశాలతో అల్లుకున్న నవల ‘పొన్నియిన్ సెల్వన్‌’. చోళుల సామ్రాజ్యంలో చోటుచేసుకున్న ఎన్నో అంశాల సమాహారం ఇది. తదనంతర కాలంలో రాజరాజచోళుడిగా కీర్తి పొంది, భారత దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించిన పొన్నియిన్‌ సెల్వన్ (కావేరి నది పుత్రుడు) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన రాజ్యాధికారం స్వీకరించడానికి ముందున్న గందరగోళ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపబోతున్నారు. శత్రువుల కోసం పనిచేసిన అస్మదీయుల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఆస్కార్ విజేత ఎ. ఆర్.రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రవి వర్మన్‌ సినిమాటోగ్రాఫర్‌. తోట తరణి ప్రొడక్షన్‌ డిజైన్‌ చేశారు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే ఇవ్వబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థలు తెలిపాయి.

Exit mobile version