NTV Telugu Site icon

Polimera 2: పొలిమేర 2 కు ప్రమోషన్స్ చేస్తుంటే.. పొలిమేర 1 ను చూసేస్తున్నారేంటి

Polimera

Polimera

Polimera 2: సత్యం రాజేష్‌, డా.కామాక్షి భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో డా.అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన చిత్రం మా ఊరి పొలిమేర. ఈ చిత్రాన్ని గౌరీకృష్ణ నిర్మించాడు. కరోనా పాండమిక్ సమయంలో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా .. ప్రతి క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఇక ఇన్నేళ్లకు ఈ సినిమాకు సీక్వెల్ మొదలైంది. మొదటి పార్ట్ లోనే సెకండ్ పార్ట్ ఉందని చెప్పడంతో ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ వచ్చారు. ఇక దాదాపు రెండేళ్ల తరువాత పొలిమేర 2 విడుదలకు మోక్షం కలిగింది. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబధించి ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమాపై మరింత ఆసకిని రేకెత్తించింది.

Sona: పుట్టకతో ఎవరు చెడ్డవారు కాదు.. శృంగార తారగా నన్ను..

పొలిమేర 2 ట్రైలర్ రిలీజ్ తరువాత .. పొలిమేర సినిమాను చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. పొలిమేర పార్ట్ 1 థియేటర్ లో రిలీజ్ కాకపోవడంతో .. పార్ట్ 2 చూడాలంటే పార్ట్ 1 చూడాలి కదా అని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విపరీతంగా చూసేస్తున్నారు. పొలిమేర 2 కోసం ప్రమోషన్స్ మొదలుపెడితే .. పొలిమేర 1 ను వీక్షించడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో పొలిమేర .. టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం. ఇక ఇంతకుమించిన ప్రమోషన్స్ మరొకటి ఉండదు అని చెప్పొచ్చు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా హక్కుల్ని వంశీ నందిపాటి సొంతం చేసుకుని నవంబరు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Show comments