Police Vaari Hechharika: శరవేగంగా ‘పోలీసు వారి హెచ్చరిక’ షూట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Vaari Hechharika Movie Update: దర్శకుడు “బాబ్జీ” దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” సినిమా షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలు వంటి వాటి జోలికి భిన్నంగా దసరా పండగ రోజున “” సినీ కళామతల్లికి జై…వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ… వర్ధిల్లాలి భారతీయ సినీ పరిశ్రమ “” అనే నినాదాల మధ్య యీ సినిమా ఓపెనింగ్ చేశారు మేకర్స్. “దసరా రోజున ప్రారంభమైన యీ సినిమాకి సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్, ఘట్ కేసర్, ఘణపూర్, షామీర్ పేట తదితర ప్రదేశాలలో జరుపుకుంటూ 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుందని, ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్ లను పూర్తి చేసుకుందని, డిసెంబర్ మొదటి వారం నాటికి యీ చిత్రం తాలూకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శకుడు బాబ్జీ వెల్లడించారు.
Also Read: Sapta Sagaralu Dhaati Side B Review: సప్త సాగరాలు దాటి సైడ్ బీ రివ్యూ
Also Read
- Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
- Rajini - Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
- Box Office Collections: నవంబర్‌లో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సందడి.. డ్రై సీజన్‌ను హిట్ల సీజన్‌గా మార్చిన సినిమాలు!
- Sai Pallavi: సీత పాత్ర ట్రోల్స్.. పెదవి విప్పిన సాయి పల్లవి..!
“మన పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంతయినా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే , మన పిల్లల భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలో, పడే తపనలో , తీసుకునే జాగ్రత్తలో కొంతయినా మన కళ్ళ ముందు తిరుగుతున్న అనాథలు అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే ఆ అనాథలు సంఘ వ్యతిరేక శక్తులు చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్తులుగా మారే ప్రమాదం ఉందని సందేశం అంతర్లీనంగా సాగుతూ, పూర్తి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని డైరెక్టర్ బాబ్జీ తెలిపారు. “భారత సైన్యంలో దేశరక్షణ కోసం పని చేసిన నేను మొట్టమొదటి సారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టా, దర్శకులు బాబ్జీ చెప్పిన కథలో వున్న సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప సందేశం నచ్చి యీ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, నటీనటులు, సాంకేతిక వర్గం మనస్ఫూర్తిగా అందిస్తున్న సహకారంతో యీ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తున్నామని నిర్మాత బెల్లి జనార్ధన్ పేర్కొన్నారు. పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న అజయ్ ఘోష్ గతంలో ఏ చిత్రంలోనూ చేయని గొప్ప పాత్రను యీ చిత్రంలో చేస్తున్నారని, ఆ పాత్ర యీ చిత్రానికే ఆయువు పట్టు లాంటి పాత్రని జనార్దన్ తెలిపారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్, హనుమా, బాబూరాం, గోవింద్, గంటమోగిన రవితేజ , వేణు రాక్, సకారం, ల్యాబ్ శరత్, హిమజ, జయ వాహిని, మేఘనా ఖుషి , రుచిత, ఉజ్జ్వలా రెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravindra Jadeja: టీమ్‌లో చోటు దక్కలేదని డాక్టర్‌గా మారిన జడేజా.. స్టెతస్కోప్‌తో ఏం చేశాడో చూడండి (వీడియో)
-
Rajini – Kamal Multistarrer: రజినీ, కమల్ మల్టీస్టారర్ ఉన్నట్టా ? లేనట్టా?
-
Jagga Reddy: సోనియా గాంధీ బయోపిక్కు దర్శకుడు ఫిక్స్.. జగ్గారెడ్డి కీలక ప్రకటన..
-
Box Office Collections: నవంబర్‌లో బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ సందడి.. డ్రై సీజన్‌ను హిట్ల సీజన్‌గా మార్చిన సినిమాలు!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!