Site icon NTV Telugu

Police Vaari Hechharika: శరవేగంగా ‘పోలీసు వారి హెచ్చరిక’ షూట్

Police Vaari Hechharika Movie Update: దర్శకుడు “బాబ్జీ” దర్శకత్వంలో తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంపై బెల్లి జనార్ధన్ తన తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న “” పోలీస్ వారి హెచ్చరిక “” సినిమా షూటింగ్ సింగిల్ షెడ్యూల్లో శరవేగంగా జరుగుతుంది. రెగ్యులర్ గా  జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ముహూర్తాలు, సంప్రదాయ పద్ధతులకు, అట్టహాసాలు వంటి వాటి జోలికి భిన్నంగా దసరా పండగ రోజున “” సినీ కళామతల్లికి జై…వర్ధిల్లాలి తెలుగు సినీ పరిశ్రమ… వర్ధిల్లాలి భారతీయ సినీ పరిశ్రమ “”  అనే నినాదాల మధ్య యీ సినిమా ఓపెనింగ్ చేశారు మేకర్స్. “దసరా రోజున ప్రారంభమైన యీ సినిమాకి సంబందించిన షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాద్, ఘట్ కేసర్, ఘణపూర్, షామీర్ పేట తదితర ప్రదేశాలలో జరుపుకుంటూ 50 శాతం షూటింగ్ ను  పూర్తి చేసుకుందని, ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో సినిమాలోని కీలక ఘట్టాలతో పాటు మూడు పాటలు, రెండు ఫైట్ లను పూర్తి చేసుకుందని, డిసెంబర్  మొదటి వారం  నాటికి యీ చిత్రం తాలూకు షూటింగ్ మొత్తం పూర్తవుతుందని దర్శకుడు బాబ్జీ వెల్లడించారు.

Also Read: Sapta Sagaralu Dhaati Side B Review: సప్త సాగరాలు దాటి సైడ్ బీ రివ్యూ

“మన పిల్లలకు, మన కుటుంబానికి పంచే ప్రేమలో కొంతయినా మన చుట్టూ వుండే అనాథ బాలలకు పంచకపోతే ,  మన పిల్లల భవిష్యత్తు గురించి చేసే ఆలోచనలో,  పడే తపనలో ,  తీసుకునే జాగ్రత్తలో కొంతయినా మన కళ్ళ ముందు తిరుగుతున్న అనాథలు అభాగ్యుల విషయంలో ప్రదర్శించకపోతే  ఆ అనాథలు సంఘ వ్యతిరేక శక్తులు చేతుల్లో చిక్కుకొని సమాజాన్ని నాశనం చేసే నేరస్తులుగా మారే ప్రమాదం ఉందని సందేశం అంతర్లీనంగా సాగుతూ, పూర్తి కమర్షియల్ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని డైరెక్టర్ బాబ్జీ తెలిపారు. “భారత సైన్యంలో దేశరక్షణ కోసం పని చేసిన నేను మొట్టమొదటి సారిగా సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టా, దర్శకులు బాబ్జీ చెప్పిన కథలో వున్న సమాజానికి, దేశానికి ఉపయోగపడే గొప్ప సందేశం నచ్చి యీ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, నటీనటులు, సాంకేతిక వర్గం మనస్ఫూర్తిగా అందిస్తున్న సహకారంతో యీ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తున్నామని నిర్మాత  బెల్లి జనార్ధన్ పేర్కొన్నారు. పాన్ ఇండియా నటుడిగా ఎదుగుతున్న అజయ్ ఘోష్ గతంలో ఏ చిత్రంలోనూ చేయని గొప్ప పాత్రను యీ చిత్రంలో చేస్తున్నారని, ఆ పాత్ర యీ చిత్రానికే ఆయువు పట్టు లాంటి పాత్రని జనార్దన్ తెలిపారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్, హనుమా, బాబూరాం, గోవింద్, గంటమోగిన రవితేజ , వేణు రాక్, సకారం, ల్యాబ్ శరత్, హిమజ, జయ వాహిని, మేఘనా ఖుషి , రుచిత, ఉజ్జ్వలా రెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version