Hema: హేమ రేవ్ పార్టీ వ్యవహారంలో ట్విస్ట్.. ఆ వీడియోతో అడ్డంగా బుక్కయ్యిందిగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Twist in Hema Bengaluru Farm House Rave Party Case: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కాసేపటికి ఒక ట్విస్ట్ తెరమీదకు వస్తోంది. ఈ కేసులో ముఖ్యంగా తెలుగు నటి హేమ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ముందుగా నటి హేమ పోలీసుల అదుపులో ఉందంటూ కన్నడ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని తెలుగు మీడియా కూడా ఆమె రేవ్ పార్టీలో ఉన్నట్టు వార్తలు ప్రసారం చేసింది. అయితే సడన్ ట్విస్ట్ ఇస్తూ తాను హైదరాబాదులో ఒక ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని తాను బెంగళూరు ఫామ్ హౌస్ లో లేనని, ఆ పార్టీకి తనకి సంబంధం లేదంటూ ఆమె ఒక వీడియో విడుదల చేసింది. అయితే ఆమె వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికి అదే డ్రెస్ లో ఉన్న ఆమె ఫోటో ఒకదాన్ని బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాక హేమ విడుదల చేసిన వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ లో షూట్ చేసిందని పోలీసులు తేల్చారు.
Srikanth: మొన్న విడాకులు, ఇవాళ రేవ్ పార్టీ.. తప్పు లేదు అంటూ శ్రీకాంత్ వీడియో రిలీజ్!
Also Read
ఈ మేరకు మరో ప్రకటన చేశారు. నటి హేమ ఇదే పార్టీలో పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. హేమ వీడియో రిలీజ్ చేసిన సమయంలో ఆమె బ్యాక్ గ్రౌండ్ లో కనపడిన చెట్లు బెంగళూరు ఫామ్ హౌస్ లో ఉన్నవేనని చెబుతూ పోలీసులు ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ చెట్లను మార్క్ చేసుకుని, ఆ ఫోటోలను మీడియాకు రిలీజ్ చేయడం గమనార్హం. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు సినీ, టీవీ నటీనటులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ రేవ్ పార్టీలో కొకైన్ తో పాటు మరిన్ని రకాల డ్రగ్స్ వాడుతున్నట్లు తెలియడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో కలిసి రైడ్స్ చేశారు. ఇక రైడ్స్ చేసిన సమయంలో వందమందికి పైగా ఈ పార్టీకి హాజరైనట్లు గుర్తించారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు పోలీసులు. కొంతమేర డ్రగ్స్ తో పాటు, 15 లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వందమందికి పైగా పోలీసులు అదుపులో ఉండగా వారిలో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?