Site icon NTV Telugu

Prabhas: యంగ్ రెబల్ స్టార్ కు షాక్ ఇచ్చిన పోలీసులు.. నడిరోడ్డుపై కారు ఆపి

Prabhas

Prabhas

హైదేరాబద్ ట్రాఫిక్ పోలీసులు నిభందనలు ఉల్లంఘించినవారిపై కొరడా జుళిపిస్తున్నారు.సామాన్యులు, సెలబ్రిటీలు అనే బేధం చూపించకుండా నిబంధనలు ఉల్లంఘించినవారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాలకు ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని గత కొన్నిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక సెలబ్రీటీలు ప్రైవసీ కోసం బ్లాక్‌ ఫిల్మ్‌లు వాడుతుంటారని అందరికి తెలిసిందే. ఇటీవల వారిని కూడా పోలీసులు వదలడం లేదు. ఇప్పటికే ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌, మంచు మనోజ్, నాగ చైతన్య కార్లను అడ్డుకున్న పోలీసులు బ్లాక్ ఫిల్మ్ ను తొలగించి జరిమానా విధించారు. ఇక తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కారును పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లో ప్రభాస్ కారును ఆపిన పోలీసులు కారుకు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండడం, కారుకు ఎంపీ స్టిక్కర్ అతికించి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే బ్లాక్ ఫిల్మ్ ను, ఎంపీ స్టిక్కర్ తొలగించి రూ.1,450 జరిమానా విధించారు. అయితే ఆ సమయంలో కారులో ప్రభాస్ లేరని, డ్రైవర్ చేత జరిమానా కట్టించినట్లు పోలీసులు తెలిపారు.

Exit mobile version