Police Complaint Director: వారి వల్లే వరలక్ష్మికి సారీ చెప్పా.. సమస్య సద్దుమణగలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ క్రమంలో
దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “మా చిత్ర హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ నాలెడ్జ్ కంటే మా నాలెడ్జ్ లక్ష రెట్లు ఎక్కువ ఉంది. అందుకే ప్రసన్న కుమార్ వంటి పెద్దల సూచన మేరకే ఆమెకు సారీ చెప్పడం జరిగింది. అంతేకానీ, సమస్య పూర్తి సర్దుమణిగిందని కూడా చెప్పలేను. మొత్తానికి ఒక వివాదంతో సతమతం అయ్యాం.. చివరికి విజయంతో శుభం కార్డు పడిందని భావిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో విడుదలైన ‘పోలీస్ కంప్లైంట్’కు అద్భుతమైన స్పందన వస్తోంది. విడుదలైన రెండవ రోజు నుంచే థియేటర్లు పెరుగుతున్నాయి. దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం” అని అన్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ సినిమా హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమా ప్రమోషన్లో పాల్గొనలేదని యూనిట్ ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను సంప్రదించారు. ఈ వివాదాన్ని పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కరించుకోమని చెప్పాను. దీంతో దర్శకుడు సంజీవ్ మేగోటి తన తప్పు లేకపోయినా వరలక్ష్మికి సారీ చెప్పారు. ఆయన ప్రదర్శించిన వినయం, సహనమే ఈ విజయానికి మరో కారణమని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
-
OTR: ఉమ్మడి నల్గొండలో రెడ్డి ఆధిపత్యం? కాంగ్రెస్‌లో బీసీ నేతల అసంతృప్తి!
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?