Site icon NTV Telugu

షాకింగ్: హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు..

raviteja

raviteja

మాస్ మహారాజ రవితేజ తల్లిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌ అనే వ్యక్తి ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను అధికారుల పర్మిషన్ లేకుండా ద్వసంచేసినందుకే కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఆమె, తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నట్లు సమాచారం. మరి ఈ విషయమై రవితేజ ఎలా స్పందిస్తారో చూడాలి.

Exit mobile version