Site icon NTV Telugu

JD Vance : ప్రధాని మోడీతో జేడీ వాన్స్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

Jd Vance

Jd Vance

JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. కుటుంబ సమేతంగా నరేంద్ర మోడీ అధికార నివాసానికి వెళ్లారు జేడీ వాన్స్. వారికి మోడీ ఘన స్వాగతం పలికారు. స్వయంగా వారిని లోపలికి ఆహ్వానించారు. గత ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా-అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్ ట్రస్ట్’ ను వీరు ప్రారంభిస్తారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వీరిద్దరూ చర్చించబోతున్నారు. ఆర్థిక, వాణిజ్యం, భౌగోళిక రాజకీయ సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపే అవకాశం ఉంది.

Read Also : Ashu Reddy : బ్రెయిన్ సర్జరీ వీడియో బయటపెట్టిన అషురెడ్డి..

2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో ఈ చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరుసగా టారిఫ్స్ విధిస్తున్న టైమ్ లో వీరిద్దరి భేటీ ఆసక్తిరేపుతోంది. వీటిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది. ఈ చర్చల తర్వాత జేడీ వాన్స్ కుటుంబానికి, అమెరికా అధికారులకు మోడీ ఇంట్లో విందు ఏర్పాటు చేశారు. 24 వరకు జేడీ వాన్స్ ఫ్యామిలీ ఇండియాలో పర్యటించబోతోంది. తాజ్ మహల్ తో పాటు ఇతర చారిత్రక కట్టాలను వారు సందర్శిస్తారు. జేడీ వాన్స్ వైఫ్ ఉష మన భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు, లక్ష్మీ-క్రిష్ ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం వారిద్దరూ అమెరికాలో లెక్చరర్స్ గా పనిచేస్తున్నారు.

Exit mobile version