Site icon NTV Telugu

DJ Tillu : రాధికకు చెక్ పెట్టారా..!

Dj Tillu 2

Dj Tillu 2

 

సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన డీజే టిల్లు మూవీ.. సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా. ఇందులో సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. సిద్దు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, యాటిట్యూడ్ ఈ సినిమా సక్సెస్‌కు ప్లస్‌ అయ్యాయి. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోయిన్‌గా నేహా శెట్టి గురించి.. ఈ బ్యూటీ గ్లామర్‌ టిల్లు సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. టిల్లు, రాధిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలేగా వర్కౌట్ అయింది. ఇందులో రాధిక గురించి హీరో చెప్పే డైలాగ్స్ అదరహో అనిపించుకున్నాయి. రాధిక అట్లుంటది మనతోని.. అనే డైలాగ్ బాగా పాపులర్ అయింది. దాంతో మరోసారి రాధిక, టిల్లు జోడిని తెరపై చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు ఆడియెన్స్. అందుకే డిజే టిల్లు మూవీకి పార్ట్ 2 రెడీ అవుతోంది.

ఇక డిజే టిల్లుకి మించి ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఈసారి రాధికకు చెక్ పెట్టబోతున్నారట. సీక్వెల్‌లో రాధిక పాత్ర పూర్తిస్థాయిలో ఉండదని సమాచారం.. ఆమెను అతిధి పాత్రకే పరిమితం చేయనున్నారట. రాధిక ప్లేస్‌లో టిల్లు కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో షికారు చేసేందుకు రెడీ అవుతున్నాడట. అందులోభాగంగా.. ఓ కొత్త హీరోయిన్‌ను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. దీంతో రాధిక లేకుండా ఈసారి టిల్లుగాడి లొల్లి ఎలా ఉంటుందనేది.. ఆసక్తికరంగా మారింది. ఇక హీరోయిన్‌తో పాటు మరికొన్ని కొత్త క్యారెక్టర్లు కూడా డీజె టిల్లు సీక్వెల్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాయట. ఇలాంటి విషయాల్లో త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక విమల్ కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ హిట్ సీక్వెల్‌ను.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మరి రాధిక లేకుండా టిల్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

Exit mobile version