మరో వివాదంలో శంకర్… చరణ్ కు తప్పని తిప్పలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన దర్శకుడు శంకర్ ఇటీవల కాలంలో వరుస వివాదాల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో “ఆర్సి15” అనే పాన్ ఇండియా సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 8 నుండి షూటింగ్ ప్రారంభం కానున్న రామ్ చరణ్ సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చాయి. దీంతో శంకర్ ఇప్పుడు కొత్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ మేరకు శంకర్ పై ఫిర్యాదు చేస్తూ చెన్నైలో ఉన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ చిన్నసామి సౌత్ ఇండియన్ ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్ (SIFWA)ని సంప్రదించాడు. అతను తన స్క్రిప్ట్‌ను శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ దొంగిలించారని పేర్కొన్నాడు. అయితే శంకర్ కూడా ఆ ఆరోపణలను నిజం కాదని నిరూపించడానికి ముందుకొచ్చారు. రెండు పార్టీలు తమ స్క్రిప్ట్‌లను సమర్పించారు. ఇప్పుడు SIFWA ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. గతంలో విజయ్ కోసం చిన్నసామి ఈ స్క్రిప్ట్ రాశాడట. కానీ ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ కోసం పని చేసారు. అతని స్క్రిప్ట్ ఇప్పుడు శంకర్ చేతిలో తనకు తెలియకుండానే వచ్చిందని ఆరోపించారు. రచయిత సంఘం ప్రస్తుతం రెండు స్క్రిప్ట్‌లను పరిశీలిస్తోంది. “ఆర్సీ15” యాక్షన్‌తో నిండిన సామాజిక డ్రామా.
Read also : మణిరత్నంపై కేసు నమోదు
Also Read
మరోవైపు శంకర్ తదుపరి భారీ బడ్జెట్ చిత్రం “ఇండియన్ 2” అనేక కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. శంకర్ ఇటీవల రణ్‌వీర్ సింగ్‌తో “అన్నీయన్” రీమేక్‌ను ప్రకటించాడు. సినిమా అసలు నిర్మాత ఎస్ థాను రీమేక్ హక్కులను తాను సొంతం చేసుకున్నానని, తన అనుమతి లేకుండా రీమేక్ ప్రకటించినట్లు మండిపడడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు “ఆర్సీ15”. మరి ఈ వివాదాలన్నింటి తేల్చుకుని, వాటి నుంచి బయటపడి శంకర్ తన నెక్స్ట్ మూవీని ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?