NTV Telugu Site icon

Pawan Kalyan: ‘దేవుడు’ వరకు ఓకే.. మరీ ఐటెం సాంగ్ ఏంటీ భయ్యా..?

Kalyan

Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. తమిళ్ లో సూపర్ హిట్ అందుకున్న వినోదయా సీతాం అధికారిక రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన సముతిర ఖనినే తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకొని సెట్స్ మీదకు వెళ్ళింది. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ దేవుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడట. అందుకే ముందు సముతిర ఖని.. పవన్ షెడ్యూల్ ను మొదలుపెట్టేసి త్వరగా ఫినిష్ చేయనున్నాడట. ఇకపోతే ఈ సినిమా గురించిన రెండు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో మొదటిది.. ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ను అనుకున్నారట. పవన్ కు దేవర పేరుకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. పవన్ అభిమానులు ఆయనను దేవర అనే పిలుస్తారు. భీమ్లా నాయక్ లో సైతం పవన్ ను కొక్కిలి దేవర గా చూపించారు. అందుకే ఈ టైటిల్ పెడితే బావుంటుందని అనుకున్నారట.. అయితే ఈ టైటిల్ ను ఆల్రెడీ బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించడంతో ఆయనను అడిగినా పెద్ద ప్రయోజనం లేదని త్రివిక్రమ్ దేవర కు బదులుగా దేవుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

Mamatha Mohan Das: ఆ తప్పు చేశా.. రాజమౌళి అన్న మాటతో గుండె పగిలింది

ఇక ఈ టైటిల్ వరకు ఓకే.. కానీ, రెండో వార్త ఏంటంటే.. ఈ చిత్రంలో పవన్ కు, తేజ్ కు ఒక స్పెషల్ సాంగ్ ఉండనుందంట. అందులో ఒక స్టార్ హీరోయిన్ కూడా నర్తిస్తుందని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్ సినిమాలో పాటలు ఉండవు కదా.. ఇందులో పాటలు అందులో కూడా ఐటెం సాంగ్ ఏంటండీ అంటూ అసహనం వ్యక్తం చేస్తుండగా.. దానికి కౌంటర్ గా అది త్రివిక్రమ్ థింగ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకయ్యా.. త్రివిక్రమ్.. సినిమాలో సోల్ లేకుండా కమర్షియల్ సినిమాగా చేసి మా మీద పగ తీర్చుకుంటున్నావ్ అని కొందరు అంటుండగా.. అయినా దేవుడుకు నరుడుకు సాంగ్ ఏంటి.. పవన్ ఇలాంటి సాంగ్స్ ఎలా ఒప్పుకుంటున్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ రూమర్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో నిజాలు ఏంటి అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Show comments