Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే… ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime Thriller OTT : ఓటీటీలోకి మరో కన్నడ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి ఈ రోజు నుంచి అందుబాటులోకి వస్తోంది. కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాకు చెందిన మడికేరి, భాగమండల పరిసరాల్లోని దట్టమైన అడవులు, మంచు కొండల మధ్య ఈ సినిమాను షూట్ చేశారు. ఈ లొకేషన్లు కథలోని సస్పెన్స్, క్రైమ్ మూడ్‌ను పతాక స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. ఒక సాంప్రదాయ ‘చేండే’ వాయించే డ్రమ్మర్ చుట్టూ తిరిగే సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్ ఇది. ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది బెస్ట్ సజెషన్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? ఆనే వివరాల్లోకి వెళ్తే..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘పీటర్’ (Peter) 2026లో విడుదలైన ఒక కన్నడ సస్పెన్స్ క్రైమ్ డ్రామా సినిమా. ఈ చిత్రానికి సుకేష్ శెట్టి దర్శకత్వం వహించారు. ఇందులో రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల, రవిక్ష శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రాన్ని ‘వృద్ధి స్టూడియోస్’ బ్యానర్‌పై నిర్మించగా, కన్నడ ఇండస్ట్రీలో పేరున్న ‘KVN ప్రొడక్షన్స్’ సంస్థ దీని డిస్ట్రిబ్యూషన్ తీసుకుని భారీ స్థాయిలో థియేటర్లలోకి రిలీజ్ చేసింది. ఈ సినిమా 2026 జూన్ 4 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో విడుదలైన దాదాపు 8 వారాల తర్వాత డిజిటల్ స్క్రీన్స్ పై ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్.
Also Read
- Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
- Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
- ‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
- ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
‘పీటర్’ మూవీ కథ
కన్నడ సినిమా ‘పీటర్’ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ సస్పెన్స్ క్రైమ్ డ్రామా. ఈ కథ కేరళ సరిహద్దులోని కాసరగోడ్ నుండి పీటర్ (రాజేష్ ధ్రువ) అనే యువకుడు తన గతాన్ని ఎదుర్కోవడానికి, మంచు కొండల కూర్గ్ (మడికేరి) లోని తన సొంత ఊరికి తిరిగి రావడంతో ప్రారంభమవుతుంది. ఊళ్లోకి అడుగుపెట్టగానే తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్న తన తల్లి మేరీని, తాగుడుకు బానిసైన తండ్రిని అతను కలుస్తాడు. గతంలో పీటర్ ఆ ఊరిలో అందరికీ ఇష్టమైన వ్యక్తి, అలాగే స్థానిక దేవాలయ ఉత్సవాల్లో ‘చెండే డ్రమ్స్’ వాయించే ఒక కళాకారుడు కూడా. ఆ సమయంలోనే మీరా (రవీక్షా శెట్టి) అనే కాలేజీ అమ్మాయి అతని వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమలో పడుతుంది.
ఇక వీరిద్దరి ప్రేమకథతో పీటర్ కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా సాగిపోతున్న తరుణంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. స్థానిక గుడి ఉత్సవాల నేపథ్యంలో పీటర్ స్నేహితులు, శత్రువుల మధ్య పెద్ద గొడవలు మొదలవుతాయి. ఈ గొడవల కారణంగా జరిగిన ఒక ఘోరమైన క్రైమ్ సంఘటన వల్ల పీటర్ ఒక పెద్ద తప్పు చేశాడని ఊరి జనం భావించడంతో, అతను తన ప్రేమను, ఊరిని వదిలి కాసరగోడ్ పారిపోవాల్సి వస్తుంది. ఆ మనో వేదనతో అతని తల్లి మానసిక స్థితి కూడా తప్పుతుంది. దర్శకుడు సుకేష్ శెట్టి ఈ కథను నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో నడిపించారు. తన సొంత ఊరికి తిరిగొచ్చిన పీటర్ తనపై పడిన నిందను ఎలా తొలగించుకున్నాడు ? తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు ? అనేదే ఈ సినిమా ముగింపు.
తాజావార్తలు
-
Andhra Pradesh: జడ్పీ పీఠాల పంపకం పూర్తి.. ఎవరికి ఏ జిల్లా పీఠం అంటే..?
-
Honda Rebel 500: భారత్‌లో Honda Rebel 500 లాంచ్.. 471cc ఇంజిన్, E-Clutch, TFT డిస్ప్లే.. ధర ఎంతంటే?
-
Ramayana: ‘కేజీఎఫ్ 2’ను దాటేసిన ‘రామాయణ’.. నెక్స్ట్ టార్గెట్ ‘పుష్ప 2’!
-
WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
-
Trump, Putin, Xi Jinping Meet: ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ చారిత్రాత్మక భేటీ.. 5 కీలక విషయాలు ఇవే!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!