Site icon NTV Telugu

People Media Factory: కర్ణాటక ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌లోకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Pp

Pp

People Media Factory: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏర్పాటైన కొద్ది సమయంలోనే అంటే కచ్చితత్వానికి, ఓ క్వాలిటీ ప్రొడక్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ తన విజన్‌తో నిర్మిస్తున్న చిత్రాలు, ముందుకు వెళ్తున్న తీరుతో టాలీవుడ్‌లో ఓ బ్రాండ్ ఏర్పడింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటున్నాయి. అందుకే భారీ బడ్జెట్ చిత్రాలకు టీజీ విశ్వ ప్రసాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.

Also Read: Devara : ‘జాన్వీ’ బాయ్ ఫ్రెండ్ షాక్!

ఇక ఓవర్సీస్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సత్తా చాటిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇకపై శాండిల్ వుడ్‌ను ఏలేందుకు సిద్దమైంది. కన్నడ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి టీజీ విశ్వ ప్రసాద్ అడుగు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.. కేఆర్‌జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇకపై అక్కడ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయనున్నట్టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. అక్కడ కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వ ప్రసాద్ తమదైన ముద్రను వేయబోతున్నామని ప్రకటనలో పేర్కొన్నారు.

Exit mobile version