NTV Telugu Site icon

Rakesh Varre: బాహుబలి నటుడు.. మొన్న హీరో.. నేడు నిర్మాత.. మాములుగా లేదుగా

Pekamedalu

Pekamedalu

Rakesh Varre: బాహుబలి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి రాకేష్ వర్రే గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దేవసేన మీద చెయ్యి వేసి.. బాహుబలి చేతిలో చెయ్యి నరికించుకున్న సేతుపతినే రాకేష్ వర్రే. జోష్ సినిమాలో నెగెటివ్ రోల్ తో ఇండస్ట్రీకి పరిచయమైన అతను.. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. బాహుబలి ఇచ్చిన గుర్తింపుతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ ను నిర్మించి అందులో ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత గ్యాప్ ఇచ్చిన రాకేష్.. ఈసారి నిర్మాతగా మారి కొత్త ట్యాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. నా పేరు శివ, అంధగారం వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ లను తెలుగు తెర కి హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పేకమేడలు అనే సినిమాను నిర్మిస్తున్నాడు.

Tamannaah Bhatia: తెలంగాణ కోడలు కాబోతున్న తమన్నా.. మరి విజయ్ పరిస్థితి..?

నీలగిరి మామిళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ బస్తీ, సిటీని కలగలిపిన 360 డిగ్రీలో ఉన్న ఫోటోకి మధ్యలో ఆకాశానికి నిచ్చన వేసిన కథానాయకుడు వినోద్ కిషన్ లుంగీ కట్టుకుని, బనియన్ వేసుకుని సగం తొడుక్కున్న చొక్కాని, కళ్ళజోడు పెట్టుకుని చిరునవ్వుతో కనిపిస్తున్నారు, బ్యాగ్రౌండ్ లో ఉన్న బస్తి, సిటీ కలగలిపినట్టు కథానాయకుడు ఆహార్యంలో ఫార్మల్ బట్టలు సగం, బనియన్ లుంగీ సగం కట్టుకుని ఉన్నారు.. ఆ పోస్టర్ కి సరిపడా పేకమేడలు టైటిల్ సరిగ్గా సరిపోయింది. ఒక యూనీక్ స్టోరీలైన్ తో పూర్తిస్థాయి ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.. మరి ఈ సినిమాతో రాకేష్ నిర్మాతగా సక్సెస్ అవుతాడేమో చూడాలి.

Show comments