Site icon NTV Telugu

Peka Medalu Trailer: వెధవ పనులు చేసేటప్పుడు పది మందికి తెలియకుండా చేయాలి..

Untitled Design (3)

Untitled Design (3)

గతంలో కార్తీ హీరోగా వచ్చిన నా పేరు శివ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటించి మెప్పించిన వినోద్ కిషన్ గుర్తుండే ఉంటాడు. తాజగా వినోద్ ‘పేక మేడలు’ అనే చిత్రం హీరోగా తెలుగు తతెరకు పరిచయం అవబోతున్నాడు. వినోద్ సరసన అనూష కృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది.

కాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్ర పోస్టర్ ను విడుదల చేసారు. నేడు చిత్ర ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేసారు . నార్మల్ గా హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తు ఉద్యోగం లేని యువకుడి పాత్రలో వినోద్ కనిపించాడు. భర్తను మంచి చేడు చెప్పే భార్య పాత్రలో అనూష కృష్ణ మెప్పించింది. తరచుగా అతని తండ్రి తరచు తిడుతుంటారు. అయితే ఆయన మాటలతో విసుగు చెందిన విజయం సాధించడానికి ఎవరైనా ఏదైనా చేయగలరని కథానాయకుడు భావిస్తాడు.

టీజర్ ఆద్యంతం కామెడీ ప్రధానంగా సాగింది. ట్రైలర్ చివరన వెధవ పనులు చేసే టప్పుడు పది మందికీ తెలియకుండా చేయాలని తెలీదా డైలాగ్ బాగుంది.
ఇక టీజర్ బాగా కట్ చేసిన విధానం బాగుంది, హీరో పాత్రను ఎంటర్టైనింగ్ గా హైలైట్ చేసారు. థియేటర్లలో విడుదల అయ్యే కంటెంట్ ఉంది. కాగా ఈ చిత్రాన్ని ‘బాహుబలి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి, ఎవరికి చెప్పొద్దూ చిత్రంతో హీరోగా మరిన రాకేష్ వర్రే తన క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ‌లో స్వయంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేష స్పందన రాబడుతోంది.

Exit mobile version