NTV Telugu Site icon

Rakshana in Aha: ఓటీటీలోకి పాయల్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’.. ఎక్కడ చూడాలంటే?

Pr

Pr

Payal Rajput thriller movie rakshana: సెన్సేషనల్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ప్రధాన పాత్రలో, ప్రణదీప్‌ ఠాకూర్‌ దర్శక, నిర్మాణంలో రూపొందిన మూవీ ‘రక్షణ’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ జూన్‌ 7న బాక్సాఫీసు ముందుకొచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు థ్రిల్‌ పంచేందుకు సిద్ధమై ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ ఓటీటీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా పాయల్‌ రాజ్‌పుత్‌ “లేడి సింగం” గా అదరగొట్టింది. మానస్ నాగులపల్లి, రాజీవ్ కనకాల, చక్రపాణి ఆనంద ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి యంగ్ కంపోజర్ మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. థియేటర్లలో “రక్షణ” మూవీ మిస్ అయినా వారు అహాలో చూసేయచ్చు.

 

 

Show comments