NTV Telugu Site icon

Payal Rajput: న‌చ్చితేనే ఓకే చెబుతున్నా!

Payal Rajput Movie

Payal Rajput Movie

Payal Rajput Talks About Her Movie Selection: ‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఓవ‌ర్ నైట్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది పంజాబీ భామ పాయ‌ల్ రాజ్ పుత్. అయితే ఆ త‌ర్వాత ఆమె న‌టించిన సినిమాలు ఆ స్థాయి విజ‌యాన్ని పొంద‌లేదు. త‌న తొలి చిత్రం అనుభ‌వం గురించి చెబుతూ, ”ఆ సినిమాను కోటి నుంచి రెండు కోట్లు పెట్టి తీస్తే 30 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. అందులో రా అండ్ రఫ్ క్యారెక్టర్ లో మేకప్ లేకుండా నటించాను. ఆ సినిమా తరువాత కొంతమంది రాంగ్ గైడెన్స్ ఇవ్వడంతో నా కొచ్చిన ప్ర‌తి అవ‌కాశాన్ని అంగీక‌రించాను. దాంతో కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయి. ఇప్పుడు ఖ‌చ్చితంగా స్క్రిప్ట్స్ వింటున్నాను. నాకు నచ్చితేనే సినిమాకు ఓకే చెబుతున్నాను” అని తెలిపింది.

ఈ ఏడాది ఇప్పటికే పాయ‌ల్ న‌టించిన ‘తీస్ మార్ ఖాన్’ మూవీ విడుద‌లైంది. ఈ నెల 21న ‘జిన్నా’ విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ గురించి పాయ‌ల్ మాట్లాడుతూ, ”ఒక‌సారి మోహన్ బాబు గారు ఫోన్ చేసి ‘అనగనగా ఓ అతిథి’ సినిమాలో చాలా మెచ్యూరిటీ గా, ఎక్సలెంట్ పెర్ఫార్మన్స్ చేశాన‌ని అభినందించారు. ఆ సినిమా నాకు ఒక యాక్ట్రెస్ గా చాలా సంతృప్తిని ఇచ్చింది. ఆ తర్వాత రెండు నెలలకు ‘జిన్నా’ ప్రాజెక్ట్ లో వర్క్ చేసే అవకాశం వచ్చింది. అందుకు ప్రధాన కారణమైన మోహన్ బాబు గారికి బిగ్ థాంక్స్. ఈ సినిమాలో నా క్యారెక్టర్ వెరీ యూనిక్ గా ఉంటుంది. విలేజ్ గర్ల్ స్వాతి పాత్రలో పికిల్స్ అమ్మే అమ్మాయిగా నటించాను. ఇది పక్కా పైసా వసూల్ మాస్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్. విష్ణు గురించి మాటల్లో చెప్పలేను. తను చాలా ఎనర్జిటిక్, హంబుల్ పర్సన్. మంచి మనసున్న వ్యక్తి. ఆయనతో, సన్నీతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అలాగే కోన వెంక‌ట్ గారితో, చోటా కె. నాయుడు, అనూప్ రూబెన్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇలా అందరితో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను” అని తెలిపింది.

ప్ర‌స్తుతం చేస్తున్న ఇత‌ర సినిమాల గురించి పాయ‌ల్ చెబుతూ, ”మూడు ప్రాజెక్ట్ రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. కన్నడ ‘హెడ్ బుష్’ అనే మూవీ చేస్తున్నాను. ఇది అండర్ వరల్డ్ డాన్ బయోపిక్ . ఇంకొకటి ‘మీటూ మాయా పేటిక’. ఇందులో ఐదు స్టోరీస్ ఉంటాయి. ఈ సినిమాలో నాది చాలా ఇంట్రెస్టింగ్ రోల్ . తమిళంలో ‘గోల్ మాల్’ సినిమా చేస్తున్నాను. ఇది ‘దే దనాధ‌న్’ కి రీమేక్. ఇందులో జీవా నటిస్తున్నాడు. ఇంకొక సినిమా కథ చర్చల్లో ఉంది” అని తెలిపింది.

Show comments