Site icon NTV Telugu

Payal Rajput: మంగళవారం… ఏ రోజు వస్తుంది?

Payal Rajput

Payal Rajput

ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ లో బ్యాక్ లెస్ గా న్యూడ్ గా కనిపించింది. పాయాల్ రాజ్ పుత్ ‘శైలజ’ అనే పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి విరుపాక్షకి మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన అజ్నీష్ లోకనాథ్, మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also: Suryaputra Karna : కర్ణుడి పాత్రలో చియాన్ విక్రమ్.. టీజర్ అదిరిపోయిందిగా..

ఇటీవలే రిలీజైన మంగళవారం టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ లో మేకింగ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చేసిన హైప్ ని మరింత పెంచుతూ ఇటీవలే “గణగణా మోగాలిరా” సాంగ్ బయటకి వచ్చి సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ తో మంగళవారం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. ఇప్పుడు మంగళవారం సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇస్తూ అజయ్ భూపతి ట్వీట్ చేసాడు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. మరి మంగళవారం సినిమా ఏ రోజు బయటకి వస్తుందో చూడాలి.

Exit mobile version