NTV Telugu Site icon

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ సిద్ధంకండమ్మా.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చేస్తున్నాడు

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: రన్ రాజా రన్ సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ తదుపరి సినిమానే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు. సాహో సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు. సినిమా పరాజయాన్ని అందుకున్నా సుజీత్ కు మాత్రం మంచి గుర్తింపునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ సినిమా తర్వాత కొద్దిగా గ్యాప్తీసుకున్న ఈ డైరెక్టర్ సుడి ఎలా ఉంది అంటే.. రొట్టె విరిగి నేతిలో పడిన చందాన.. ప్రభాస్ తో సినిమా అవ్వగానే పవన్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేసాడు. పవన్ ప్రస్తుతం ఒక పక్క రాజకీయాలతో, ఇంకోపక్క సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయినా సుజీత్, పవన్ ను కలవడం, కథను చెప్పి ఒప్పించడం, పోస్టర్ తో కన్ఫర్మ్ చేయడం కూడా చక చక జరిగిపోయాయి.. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లో పవన్ నిలబడిన నీడకు గన్ పెట్టడం.. ” అతనిని ఓజి అని పిలుస్తారు” అని ట్యాగ్ లైన్ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. సరే పోస్టర్ తోనే సరిపెడతారు.. పవన్ అంతకుముందు ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయి.. కాబట్టి సుజీత్ లైన్ వచ్చేసరికి ఎన్నేళ్లు పడుతుందో అని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా మనోడు అప్పుడే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు.

జనవరి 30 అనగా రేపు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. దీంతో అభిమానులు ఒక పక్క సంతోషిస్తూనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఇంకా హరిహర వీరమల్లు పూర్తి కాలేదు.. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ పూజా కార్యక్రమాలు జరుపుకొని ఎదురుచూస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్తోంది అని చెప్తున్నారు కానీ.. షూటింగ్ అనుకున్న సమయానికి అవుతుందా..? అని అభిమానులు అనుమానిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ ఏమి ఉండవని తెలుస్తోంది. దీంతో త్వరగానే పవన్ సినిమాను పూర్తి చేసే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాను పవన్ ఎప్పుడు ఫినిష్ చేస్తాడో చూడాలి.

Show comments