Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan’s Ustaad Bhagat Singh workshops will begin in the coming week: పవన్ కళ్యాణ్ హీరోగా వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన ఈ సినిమా హిట్ టాక్ కూడా తెచ్చుకుంది. కలెక్షన్స్ విషయంలో కొంత డ్రాప్ కనిపిస్తున్నా ప్రొడ్యూసర్స్ మాత్రం మేం హ్యాపీ అని చెబుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఆ సినిమా క్యాన్సిల్ కావడం అదే కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తిగా పక్కన పెట్టేశారు. అసలు ఒకానొక దశలో ఈ సినిమా ఆగిపోతుందేమో అనే ప్రచారం కూడా జరిగింది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందపడే విధంగా ఈ సినిమా పనులు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది.
Pragya Jaiswal Pics: ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోత.. కళ్లు తిప్పుకోని అందం!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందపడే విషయం ఏమిటంటే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాల మీద వారికి ఉన్న నమ్మకం కంటే ఉస్తాద్ భగత్ సింగ్ మీద నమ్మకం ఎక్కువగా ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా కూడా ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో అని వారందరూ నమ్ముతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఈ సినిమా అసలు ఉంటుందో లేదో అనే అనుమానాలు తలెత్తగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్స్ వచ్చే వారంలో మొదలు కాబోతున్నాయనే వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాస్త పొలిటికల్ టచ్ ఇచ్చి ఎన్నికలకు కూడా వాడుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని పవన్ అభిమానులైతే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ తమిళ తేరి సినిమా రీమేక్ కాబట్టి ఎంతవరకు దాన్ని తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తారు అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!