NTV Telugu Site icon

Kushi: రీరిలీజ్ కి రెడీ అయిన క్లాసిక్ లవ్ స్టొరీ…

Khusi

Khusi

పవర్ స్టార్ పవన్ కస్ల్యాన్ నటించిన సినిమాల్లో అభిమానులకి బాగా నచ్చిన చిత్రం ఏది అంటే ఒకరు ‘జల్సా’ అంటారు, ఇంకొకరు ‘గబ్బర్ సింగ్’ అంటారు, మరొకరు ‘బద్రీ’ అంటారు కానీ దాదాపు మెజారిటీ ఫాన్స్ నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ఖుషి’. ఎస్.జే సూర్య డైరెక్ట్ చేసిన ‘ఖుషి’ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. పవన్ 7వ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీలో భూమిక హీరోయిన్ గా నటించింది. ఈ ఇద్దరి మధ్య డైరెక్టర్ డిజైన్ చేసిన సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్ గానే ఉంటాయి. ఒక బ్యుటిఫుల్ లవ్ స్టొరీకి హీరో యాటిట్యూడ్ తోడైతే ఎలా ఉంటుందో ‘ఖుషి’ సినిమా చూపించింది. ఈ మూవీలో ‘నువ్వు గుడుంబ సత్తి కావొచ్చు, తొక్కలో సత్తి కావొచ్చు బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐయామ్ సిద్ధూ, సిద్దార్థ్ రాయ్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ని ఈరోజుకి ఆయన ఫాన్స్ వాడుతూనే ఉంటారు.

‘ఖుషి’ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్స్ చాలా సింపుల్ అండ్ స్టైలిష్ ఉంటాయి. ఈ ప్రేమ కథా చిత్రానికి అతిపెద్ద బలం సంగీతం. మణిశర్మ ‘ఖుషి’ సినిమాకి సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడు. 2001లో దాదాపు ఆ ఏడాది మొత్తం ‘ఖుషి’ పాటలు మోతమోగుతునే ఉన్నాయి అంటే మణిశర్మ చేసిన మ్యాజిక్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ‘ఖుషి’ సినిమా పాటలే కాదు ఈ మూవీలో మణిశర్మ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రెండ్ సెట్టర్ అయ్యింది. అప్పట్లో ప్రతి ఒక్కరి ఫోన్ కి ‘ఖుషి’ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రింగ్ టోన్ గా ఉండేది. ఇలాంటి ఒక మోడరన్ క్లాసిక్ లవ్ స్టొరీ సినిమాని రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ‘ఏ.ఎమ్ రత్నం’ నిర్మాణ సంస్థ అయిన ‘శ్రీ సూర్య మూవీస్’ బ్యానర్ పై ‘ఖుషి’ సినిమా తెరకెక్కింది. ఈ రీరిలీజ్ గురించి ‘ఏ.ఎమ్ రత్నం’ నిర్మాణ సంస్థ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ‘ఖుషి’ రీరిలీజ్ గురించి అఫీషియల్ గా పోస్ట్ చేసింది.

Show comments