Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా సినిమాలను వదలడం లేదు. రాజకీయాలకు కావాల్సిన డబ్బు కోసం తాను సినిమాలు చేస్తున్నట్లు పవన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి సినిమా, సుజిత్ సినిమా.. ఇక ఇవేమి ఇంకా పూర్తికాలేదు అప్పుడే ఇంకో సినిమాకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.డైరెక్టర్ హరీష్ శంకర్ తో మరో సినిమాను చేయనున్నాడు. ఈ విషయాన్ని హరీష్ అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ సినిమా కోలీవుడ్ లో విజయ్ నటించిన తేరి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి.
అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అయ్యింది. ఎప్పుడో వచ్చిన ఈ సినిమాను పవన్ రీమేక్ చేయడం ఏంటని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పవన్ ఖాతాలో రీమేక్ ల లిస్ట్ ఎక్కువైపోతోంది. భీమ్లా నాయక్ సమయంలోనే రీమేక్ లు ఆపేయమని ఫ్యాన్స్ మొత్తుకున్నారు. మళ్లీ ఇప్పుడు రీమేక్ అని తెలియడంతో.. అన్నా నీకు దండం పెడతాం.. దయచేసి రీమేక్ లు మాత్రం చేయకు అంటూ బతిమిలాడుకుంటున్నారు. ఇక గతంలో కాటమరాయుడు కూడా ఇలాగే తీసాడు పవన్. తమిళ్, తెలుగులో రిలీజ్ అయిన అజిత్ సినిమాను రీమేక్ చేసి పరాజయాన్ని చవిచూశాడు. ఇప్పుడు ఈ సినిమాను కూడా ఇలాగే తీసి మరో ప్లాప్ ను అందుకోవద్దని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా తేరికి రీమేకా..? కాదా..? అనేది తెలియాల్సి ఉంది.
https://twitter.com/harish2you/status/1600782845894889472?s=20&t=tqysCe0lNhEPX1L1gZLRNw
