Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి పండుగ లాంటి వార్త

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan will be back to shooting soon: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త తెరమీదకు వచ్చింది. అయితే ఈ వార్త అధికారికం కాదు కానీ జనసేన వర్గాల్లో అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్స్ అన్ని నిలిపివేసి మరి ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్నారు. ఇక ఇప్పుడు యాత్రకు బ్రేక్ ఇచ్చి ఈ మధ్యనే ఢిల్లీ పర్యటనకు కూడా వెళ్లారు. అక్కడ అమిత్ షా సహా సహా పలువురు బీజేపీ పెద్దలతో భేటీ అయిన పవన్ కళ్యాణ్ కి అక్కడ నుంచి కొన్ని కీలక సంకేతాలు అందినట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని అమిత్ షా నుంచి పవన్ కళ్యాణ్ కి సూచనలు అందడంతో ఆయన పొలిటికల్ యాక్టివిటీ తగ్గించి తాను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Angelina Jolie: ఏంజెలీనా జోలీకి డ్రగ్స్ అమ్మాను.. సింగర్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. పవన్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల దర్శక నిర్మాతలైతే పవన్ ఎప్పుడు ఖాళీ అవుతాడా? ఎప్పుడు షూటింగ్స్ కి వస్తాడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా షూటింగ్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఆ సినిమా పూర్తి చేసే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు ముందస్తు కాదు అని తెలియడంతో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వరుసగా పవన్ సినిమాలు ప్రేక్షకులను అలరించే సూచనలు కూడా ఉన్నాయి. దీంతో పవన్ అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కాలమే నిర్ణయించాలి.

Exit mobile version