Gave methadone pills to Angelina Jolie in high school says Rapper Mickey Avalon: జూన్ 4, 1975న USAలోని కాలిఫోర్నియాలో జన్మించిన ఏంజెలీనా జోలీకి నటన వారసత్వంగా వచ్చింది. ఏంజెలీనా తండ్రి జాన్ వోయిట్, తల్లి మార్చెలిన్ బెర్ట్రాండ్ కూడా ఫేమస్ యాక్టర్స్. ఏంజెలీనా కూడా చాలా చిన్న వయస్సులోనే నటించడం ప్రారంభించింది. ఆమె తన తండ్రితో కలిసి లుకింగ్ టు గెట్ అవుట్‌లో మొదటిసారి కనిపించింది. అయితే అప్పటి వరకు ఆమె నటనపై సీరియస్‌గా లేదు కానీ ఆ తరువాత ఆమె నటిగా సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ఏంజెలీనాకు కేవలం ఒక సంవత్సరం వయస్సు ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు ఆ సమయంలో విడాకులు తీసుకున్నారు. ఇక ఆ సంగతి అలా ఉంచితే ఏంజెలీనా జోలీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆమెకు డ్రగ్స్ విక్రయించినట్లు రాపర్ మిక్కీ అవలోన్ పేర్కొన్నాడు.
OTT Release Movies: ఒక్కరోజే 15 మూవీస్.. ఆ రెండు సినిమాలు..!
తాజాగా మిక్కీ FACTZ పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ, “నేను ఆమెకు మా నాన్నగారి మెథడోన్ మాత్రలలో కొన్నింటిని ఇచ్చా, వాటిని బహుశా $5 లేదా $10కి విక్రయించానని అన్నారు. ఆమె వాటిని తన ప్రియుడికి ఇచ్చి ఉండవచ్చు ఎవరికి తెలుసు?” అని ఆయన కామెంట్ చేశారు. నిజానికి డ్రగ్స్‌తో తన పోరాటం గురించి ఏంజెలినా గతంలోనే ఓపెన్‌గా చెప్పింది. ఇక నిజానికి ఏంజెలీనా మూడుసార్లు ప్రేమలో పడింది కానీ ఆ మూడుబంధాలు ఫెయిల్ అయ్యాయి. ముందుగా ఆమె నటుడు జానీ లీ మిల్లర్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఇద్దరూ హ్యాకర్ సినిమా సెట్స్‌లో కలుసుకున్నారు. చివరికి ఇద్దరూ మార్చి 28, 1996న పెళ్లి చేసుకున్నారు. ఆ సమయంలో ఏంజెలీనా తన రక్తంతో తన టీ-షర్టుపై జానీ లీ మిల్లర్ పేరు రాసుకుంది. అయితే పెళ్లయిన ఒక సంవత్సరం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి 1999 ఫిబ్రవరి 3న ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూడా ఆమె ఇద్దరినీ వివాహం చేసుకుని ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చింది.