Site icon NTV Telugu

Pawan Kalyan: ఒడిశా రైలు ప్రమాదం.. ఎమోషనల్ అయిన జనసేనాని

Pawan

Pawan

Pawan Kalyan: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. గతరాత్రి బాలాసోర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో.. రెండు సూపర్ ఫాస్ట్ రైళ్లు.. ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. దాదాపు 237 మంది ప్రాణాలు కోల్పోగా.. 900 వందల కంటే ఎక్కువమంది క్షతగాత్రులుగా మిగిలారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ఆసుపత్రిలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక లోకల్ హీరోలు.. ఇలాంటి సమయంలో రక్తం అందించి మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న, పెద్ద హీరోలు అని లేకుండా అందరూ.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ .. ఈ ఘటనపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతికి గురైన ట్లు తెలిపారు.

Al Pacino: ప్రేయసి కడుపులో బిడ్డకు డీఎన్ఎ టెస్ట్ చేయించిన 83 ఏళ్ళ నటుడు.. సిగ్గుండాలి

“శుక్రవారం రాత్రి ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ సమీపంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి లోను చేసింది. 278 మంది ప్రయాణీకులు ఈ దుర్ఘటనలో మృత్యువాతపడటం దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు – హౌరా సూపర్ ఫాస్ట్ రైళ్లలో తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత ప్రయాణీకులు, వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఈ దుర్ఘటన నేపథ్యంలో రైలు ప్రమాద ఘటనల నివారణకు సంబంధించిన భద్రత చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణ దృష్టి పెట్టాలి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version