Site icon NTV Telugu

Pawan Kalyan: కనుమ రోజు గోశాలలో పవన్.. ఫోటోలు వైరల్

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటుపక్క రాజకీయాలు, ఇటుపక్క సినిమాలను రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ ఎప్పుడు హాట్ టాపికే. ఈ మధ్యనే యువశక్తి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. అయితే ఈ రాజకీయాలను కొద్దిసేపు పక్కన పెట్టి పవన్ కనుమ పండుగరోజు ఇదుగో ఇలా గోశాలలో దర్శనమిచ్చారు. మొదటి నుంచి పవన్ తన ఫార్మ్ హౌస్ లో ఎక్కువ మొక్కలు పెంచడం, పశువులను చూసుకోవడం చేస్తూ ఉంటారు. ఇక నేడు కనుమ పండుగ సందర్భంగా గోశాలలో గో పూజ నిర్వహించారు. పశువులకు పూజ చేసి వాటి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఈ ఫోటోలను జనసేన.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

“కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే వేడుక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేడు సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో కనుమ వేడుక జరిపారు.గోపూజ నిర్వహించారు ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక పవన్ సినిమాల విషయానికొస్తే హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకొంటుండగా.. ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Exit mobile version