Site icon NTV Telugu

OG : ఓజీ ప్రమోషన్లకు పవన్ కల్యాణ్‌ దూరం..?

Og

Og

OG : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఓజీపై భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతోంది. హరిహర వీరమల్లు నష్టాన్ని ఓజీతో తీర్చేయాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఈ మూవీతో పవన్ మాస్ ఇమేజ్ మరోసారి పెరుగుతుందని ఆశిస్తున్నారు అభిమానులు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో పవన్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. ఈ సారి ఓజీ ప్రమోషన్లకు పవన్ పూర్తిగా దూరంగా ఉండబోతున్నాడంట. వీరమల్లు సినిమా కోసం పవన్ భారీగా ప్రమోషన్లు చేశాడు. గతంలో ఎన్నడూ చేయని విధంగా ఆ మూవీ కోసం కష్టపడ్డాడు.

Read Also : Kannappa : కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కానీ ఇప్పుడు మాత్రం ఓజీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడంట. డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నాడు పవన్. పైగా ఓజీపై మంచి అంచనాలున్నాయి. కాబట్టి ప్రమోషన్ చేయకపోయినా బజ్ తగ్గదనే భావనలో ఉన్నాడంట పవన్. కాబట్టి ప్రమోషన్ల బాధ్యతను మిగతా మూవీ టీమ్ చూసుకుంటుందంట. రిలీజ్ అయ్యాక హిట్ టాక్ వస్తే అప్పుడు సక్సెస్ మీట్ కు పవన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూవీ ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Lokesh Kanagaraj : అతను లేకుంటే సినిమాలు చేయను.. లోకేష్ సంచలన ప్రకటన

Exit mobile version