Site icon NTV Telugu

Pawan Kalyan: న్యూ ఇయర్ కి ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు…

Pawan Kalyan Og

Pawan Kalyan Og

సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. అయితే ఏంటి… అది పవర్ స్టార్ సినిమా, సమయం వచ్చినప్పుడల్లా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమా ఏది రిలీజ్ అయిన సరే… OGని లైన్లోకి తీసుకుంటున్నారు. ఇదేం చూశారు… OGకి ఉంటది అసలు మజా… అంటూ రచ్చ చేస్తోంది పవన్ ఆర్మీ. వాళ్లు అలా చేయడానికి కారణం డైరెక్టర్ సుజీత్… ఎందుకంటే… పవర్ స్టార్‌కు ఈయన డై హార్డ్ ఫ్యాన్‌. అలాంటి ఫ్యాన్ తన అభిమాన హీరోని ఎలా చూపిస్తాడోనని… OG కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే హంగ్రీ చీతా అంటూ రిలీజ్ అయిన గ్లింప్స్‌ డిజిటల్ మీడియాను షేక్ చేసింది. అందుకే… సలార్ రిలీజ్ అయిన సందర్భంగా… OGలో పవన్‌కు సుజీత్ ఇచ్చే ఎలివేషన్… సలార్‌కు మించి ఉంటుందని, సలార్ రికార్డులను OG బ్రేక్ చేస్తుందని ట్రెండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో… ‘సలార్’ మూవీలో జగపతిబాబు కూతురుగా ‘రాధారమ’ పాత్రలో నటించిన శ్రీయ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. OGలో శ్రియా రెడ్డి కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. దీంతో… ‘ఓజీ’ మూవీ సలార్‌ని మించి ఉంటుంది. సుజిత్ ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాడు. అసలు ఓజీతో సుజిత్ ఏం చేయబోతున్నాడనేది… మీ ఊహకు కూడా అందదు అంటూ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది. దీంతో ఓజీ హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. దీనికి తోడుగా న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఓజీ నుంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం. పవర్ స్టార్‌కి సంబందించిన పవర్ ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు కాబట్టి… 2024 ఎంట్రీతోనే ఓజీ సోషల్ మీడియాను షేక్ చేయనుంది. మరి ఓజీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version