Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Pawan Kalyan Statement On Bheemla Nayak Pre Release Event Cancel

PawanKalyan : ‘విషాద సమయంలో వేడుక… మనస్కరించట్లేదు

Published Date :February 21, 2022 , 12:22 pm
By Prakash
PawanKalyan : ‘విషాద సమయంలో వేడుక… మనస్కరించట్లేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా పడింది. ఆంధ్రప్రదేవశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం వల్ల ‘భీమ్లా నాయక్’ ఈవెంట్ ను వాయిదా వేశారు. పవన్ కళ్యాణ్, రానా ముఖ్యపాత్రధారులుగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ఆధారంగా తెరకెక్కింది. తెలుగు నేటివిటికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో తెరకెక్కిన ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. థమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.

Read Also : Bheemla Nayak : ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

‘భీమ్లా నాయక్’ వేడుకను భారీ ఎత్తున హైదరాబాద్ లోని యూసప్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్లాన్ చేశారు. తెలంగాణ మంత్రి కె.తారకరామారావు ముఖ్య అతిథిగా పాల్గొనవలసింది. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో వాయిదా పడింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ‘విషాద సమయంలో సినిమా వేడుక చేయడానికి మనస్కరించట్లేదు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది’ అంటూ హీరో పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bheemla Nayak
  • Bheemla Nayak Pre Release Event
  • Bheemla Nayak Pre Release Event cancelled
  • janasena
  • pawan kalyan

తాజావార్తలు

  • Vishnu Kumar Raju: ‘ఆల్కహాల్ గన్’ చూపిస్తూ జగన్‌పై విష్ణుకుమార్‌ రాజు హాట్‌ కామెంట్స్..

  • SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

  • Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు

  • Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..

  • CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions