Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఇప్పటివరకు జనసేన తరుపున ప్రచార సభలో మాట్లాడుతూ వచ్చిన పవన్.. చాలా గ్యాప్ తరువాత ఆయన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు. ప్రస్తుతం పవన్ నటించిన బ్రో సినిమా జూలై 28 న రిలీజ్ కానున్న విషయం తెల్సిందే. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాను సముద్రఖని తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ వేదికపై పవన్ మాట్లాడుతూ.. ” బ్రో కార్యక్రమానికి వచ్చిన మా కుటుంబానికి, కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు. సినిమాలు.. ఇంత అభిమానం, ఇంత ప్రేమ.. సినిమానే నాకు ఇచ్చింది. నేను సినిమాలోకి రాకముందు నుంచి బ్రహ్మానందం గారు నన్ను చూస్తూ ఉండేవాళ్ళు. ఒకోసారి ఇంత అభిమానం, ఇంత ప్రేమ.. ఒకోసారి కలా.. ననిజమా అని అనిపిస్తుంది. ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన డెస్టినీ ఇది. ఏరోజు అయినా ఒక చిన్న జీవితం బతకాలి అనుకున్నాను కానీ, నటుడు అవ్వాలని అనుకోలేదు. పాలిటిక్స్ లో కూడా వెళ్తాను అని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ, ఇంత అశేష అభిమానం, ప్రేమ ఉన్నప్పుడల్లా నేను.. మాటలతో వర్ణించలేను. మాటలు చిన్నవి నాకు. నా అణువణువునా మీరిచ్చిన ప్రేమ అభిమానం ఉంటాయి. సముద్రఖని గారు చెప్పినట్లుగా.. ఎంతసేపు సమాజం నుంచి తీసుకోవడమే కాదు. ఏదో ఒకటి ఇవ్వాలి. ఈ సినిమా ఇప్పుడు చేస్తున్నా.. కానీ, ఎప్పుడో నేను ఇలాగే ఆలోచించాను. ఈ సినిమా చాలా ప్రత్యేకమైన పరిస్థితిలో వచ్చింది.
కరోనా సమయంలో.. పాలిటిక్స్ లో ఏం చేయలేని పరిస్థితిలో.. త్రివిక్రమ్ నాకు చెప్పాడు. నేను కథ ఏంటి.. ? అని అడిగాను. నేనెప్పుడూ త్రివిక్రమ్ ను, డైరెక్టర్ ను నమ్మేస్తాను. మానిటర్ ను కూడా చూడను. సముద్రఖని గారు అందించిన మూలకథను త్రివిక్రమ్ డైల్జ్స్ అందించాడు. ఆయన సహకారంతో ఈ కథ మరింత బాగా వచ్చింది. ఇక ఈ కథ విన్నాక సముద్రఖని గారికి చాలా పెద్ద అభిమానిని అయిపోయాను. ఎందుకంటే.. తెలుగు భాషపై మనకు చాలా పట్టు తక్కువ ఉంటుంది. టింగ్లీష్ మాట్లాడుతుంటాం.. నేను కూడా కొన్నిసార్లు చెక్ చేసుకుంటూ ఉంటా.. అటు పూర్తిగా తెలుగు రాక.. ఇటు పూర్తిగా ఇంగ్లిష్ రాక.. సంపూర్ణంగా పది వాక్యాలు పరిపూర్ణమైన తెలుగులో మాట్లాడలేను.. మధ్యలో నాలుగు ఇంగ్లిష్ వాక్యాలు మాట్లాడుతూ ఉంటాను. అది నేను సరిదిద్దుకుంటాను. అలాంటింది.. తమిళనాడు నుంచి వచ్చిన ఒక డైరెక్టర్.. సముద్రఖని. మన భాష కాదు, యాస కాదు.. మొదటిరోజు స్క్రిప్ట్ రీడింగ్ వెళ్తే.. తెలుగు స్క్రిప్ట్ రీడ్ చేస్తూ కనిపించాడు. మీకు తెలుగు వచ్చా.. ? అని అడిగితె .. మీతో ప్రాజెక్ట్ ఓకే అయినదగ్గరనుంచి తెలుగు నేర్చుకున్నాను అని అన్నారు. ఆయనకు నిజంగా ఈరోజు మాటిస్తున్నా.. తెలుగు నేర్చుకొని మీరు ఇంత చేశారు కాబట్టి .. నేను తమిళ్ నేర్చుకొని ఏదో ఒక రోజు తమిళ్ లో స్పీచ్ ఇస్తా.. తమిళ్ నేర్చుకొని తిరుక్కురళ్ చెప్పాలని నాకు చాలా ఇష్టం. మీరు తెలుగుభాషను నేర్చుకొని మాకు కనువిప్పు కలిగించారు. మీరే ఇంత గొప్పగా తెలుగు నేర్చుకున్నారు అంటే.. మేము ఇంకెంత బాగా మాట్లాడాలి అని అనిపించేలా చేశారు. మాకు కనువిప్పు కలిగించారు. మన మాతృ భాషలోని సాహిత్యం చాలా గొప్పది. అది తెలుసుకుంటే.. చాలా గొప్ప గొప్ప సినిమాలు తీయగలం. ఇక ఆయన భాషలో పట్టు సాధించి ఇలాంటి సినిమా తీసిన సముద్రఖని గారికి థాంక్స్ చెప్తున్నాను.
ఇక ఈ సినిమా 50 నుంచి 70 రోజులు చేయాల్సిన సినిమా. కానీ, నా మనసు ఎలా ఉంటుంది అంటే .. ఈ పొలిటికల్ కు వెళ్ళాక .. సినిమాలు ఇష్టం, ప్రేమ.. కానీ సమాజం న బాధ్యత. ఎన్టీఆర్ లా, రామ్ చరణ్ లా నేను డ్యాన్స్ చేయలేకపోవొచ్చు. ప్రభాస్, రానా లా కొన్ని సంవత్సరాలు చేయలేకపోవచ్చు. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ లకు అదే చెప్తాను.. ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరికి చెందింది కాదు.. మా కుటుంబానికి చెందింది మాత్రం కాదు. అందరిదీ. ఈ పరిశ్రమ అనేది.. కోట్లాది మందిలో ఎవరైనా రావచ్చు.. బలంగా ప్రయత్నిస్తే అవుతుంది. సినిమా, రాజకీయం ఎవరికి చెందింది కాదు. ఎందుకంటే .. అన్నయ్య చిరంజీవి కూడా చాలా సగటు దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారం. మాకు ఎవరు అండాదండాలు లేరు. చిరంజీవి గారు.. మెగా స్టార్ డమ్ సాధించాకా.. హీరో అవుతావా అంటే .. నాకు భయమేసింది. నా ఊహల్లో హీరో అంటే చిరంజీవి గారే. కృష్ణ గారు ఉన్నారు మైండ్ లో, ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్నారు కానీ, నేనెప్పుడూ ఊహించలేదు. నా ఊహ అంతా ఏంటి అంటే.. నా మటుకు నేను చిన్నపాటి ఉద్యోగం చేసుకొని.. ఎక్కడో ఒక మూలాన వ్యవసాయం చేసుకోవాలి అనుకున్నాను. కాకపోతే నాకున్న సాహిత్యం, మార్షల్ ఆర్ట్స్ వీటన్నింటి వలన ఏదైనా చేస్తావా అంటే ఊహించుకోలేదు. దాన్ని మనస్ఫూర్తిగా బ్రేక్ చేసింది మా వదిన గారు. అంటే మనల్ని నమ్మేవాళ్ళు ఒకరు కావాలి. పర్లేదు చెయ్ అని చెప్పేవాళ్ళు ఉండాలి. సుస్వాగతం సినిమాలో డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి డ్యాన్స్ చేయమన్నారు .. చచ్చిపోయా.. అందరి ముందు చేయాలంటే సిగ్గు.. వెంటనే మా వదినకు ఫోన్ చేసి.. నువ్వు నన్ను అనవసరంగా ఎందుకు ఎగదోసావ్.. శుభ్రంగా వదిలేసి ఉంటే .. ఎవరికి కనిపించకుండా మారుమూల ఎక్కడో ఒకచోట బతికేవాడివి కదా. ఆరోజు మా వదిన చేసిన తప్పు.. ఈరోజు మీ ముందు నన్ను ఇలా నిలబెట్టింది. మా వదిన కనుకే ఆ తప్పు చేయకుండా ఉంటే.. నా పాటికి నేను చాలా చిన్న జీవితం జీవించేవాడిని. మా వదిన చేసిన ద్రోహం ఈరోజు నేను మాటల్లో వర్ణించలేను. నేనేది గ్రాంటెడ్ గా తీసుకోను.. ఆయన కష్టపడితే.. నేను ఆయనకు మించి కష్టపడాలి అనుకోని.. ఒళ్లు పగలకొట్టించుకొనేవాడిని” అంటూ చెప్పుకొచ్చారు.
