Site icon NTV Telugu

Pawan Kalyan: ప్రభుత్వ సభలో OG నినాదాలు.. పవన్ షాకింగ్ కామెంట్స్

Pawan

Pawan

Pawan Kalyan Shocking Commets on Fans Chanting OG OG: తన అభిమానులకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పలు శాఖలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో ఒక ప్రభుత్వ సభలో ఆయన మాట్లాడుతూ ఉండగా అభిమానులు ఓజి, ఓజి అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే స్పీచ్ మధ్యలో ఆపేసిన పవన్ కళ్యాణ్ సినిమాని సినిమా గానే చూడండి అని పేర్కొన్నారు. సినిమా మీద ఉన్న అభిమానాన్ని సినిమా మీద అభిమానం గానే చూడండి. కానీ సినిమా వేరు రాజకీయాలు వేరు అని ఆయన అన్నారు. సినిమా వేరు ప్రజాస్వామ్యం వేరు. సినిమా అనేది ఒక కల, మన జీవితంలో సాధించలేనివి చూసేది సినిమా. ఒకడు ఓడిపోయి మళ్లీ గెలిచి ఉపముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పడానికి సినిమాలో అయితే రెండున్నర గంటలు చాలు. మూడు గంటలు సినిమా తీసేయొచ్చు అయిపోతుంది.

Ayesha Takia: హేయ్ అయేషా నువ్వేనా? ఏమైంది నీకు.. ఇట్టా తయారయ్యావ్ ఏంటి?

నిజజీవితం అలా ఉండదు కదా తిట్లు తినాలి తన్నులు తినాలి, అసలు ఉంటామో లేదో తెలియదు. ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి. కేసులు పెడతారు, పెట్టించుకోవాలి, అటెంప్ట్ మర్డర్ కేసులు పెడతారు. ఇన్ని కష్టాల మధ్యలో ఒక దశాబ్దం పడుతుంది. దశాబ్దాన్ని రెండున్నర గంటల్లో కుదించి సినిమా చేసేయొచ్చు అందుకే సినిమాలను నేననే కాదు ఏ సినిమా అయినా మీరు నిజ జీవితాన్ని వేరు చేసి చూడండి. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం. దేశభక్తి దేశం కోసం. మీరు ఆ విషయం మర్చిపోవద్దు. మీరు ఓజి, ఓజి అంటుంటే నాకు సంతోషమే, మీరు చూస్తే నాకు డబ్బులు కూడా వస్తాయి కానీ నాకు చాలా స్పష్టత ఉంది. సినిమాకి రాజకీయానికి నేను తీసుకున్న బాధ్యతకు చాలా స్పష్టత ఉంది అని ఆయన కామెంట్ చేశారు.

Exit mobile version