పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వస్తున్న మెగా మల్టీస్టారర్ ‘బ్రో’. జులై 28న ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. తమిళం సూపర్ హిట్ మూవీ ‘వినోదయ సీతమ్’ రీమేక్‌గా బ్రో తెరకెక్కింది. ఈ సినిమాలో పవర్ స్టార్ దేవుడిగా కనిపించనున్నాడు. అందుకే బ్రో సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ అయిన బ్రో సాంగ్, లుక్స్ అదిరిపోయాయి. ఈసారి మామ, అల్లుళ్లు కలిసి బక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేయడం ఖాయమంటున్నారు. అయితే ఈ సినిమా కోసం పవన్ 20 నుంచి 25 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చారు. అందుకే.. ‘బ్రో’ సినిమాలో పవర్ స్టార్ డ్యూరేషన్ ఎంత? అనే డౌట్స్ మొదటి నుంచి వినిపిస్తునే ఉన్నాయి.
పవన్ నిడివి చాలా తక్కువనే వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ చిత్రంలో పవన్ దాదాపుగా గంటన్నర సేపు కనిపించనున్నట్టు తెలుస్తోంది. సినిమా రన్ టైం రెండు గంటల 20 నిమిషాలకు అటు ఇటుగా ఉంటే అందులో పవన్ 90 నిమిషాల పాటు కనిపించనున్నారట. ఈ సినిమా రీమేకే అయినా తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా, పవర్ స్టార్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని.. స్టొరీ, స్క్రీన్ ప్లేలో చాలా మార్పులు చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అందుకే థియేటర్లో మెగా రచ్చ మామూలుగా ఉండదని అంటున్నారు. వింటేజ్ పవర్ స్టార్‌ను చూసి మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనని మెగా వర్గాల టాక్. కాబట్టి బ్రో మూవీలో పవన్ రన్ టైం గురించి ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని చెప్పొచ్చు.