Site icon NTV Telugu

Pawan Kalyan : కన్నడలో ఓజీకి ఇబ్బందులపై స్పందించిన పవన్

Pawan

Pawan

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా నటించిన ఓజీ సినిమా తెలుగు నాట మంచి విజయం అందుకుంది. అయితే ఇదే సినిమాపై కన్నడలో కొంత వివాదం నడిచింది. ఓజీ సినిమాకు బెంగుళూరులోని సంధ్య థియేటర్ వద్ద ప్రీమియర్స్ కు ఏర్పాట్లు చేయగా.. కన్నడ సంఘాలు వచ్చి గొడవ చేశాయి. దీంతో ఓజీ ప్రీమియర్స్ ను క్యాన్సిల్ చేశారు. అయితే కాంతార-1కు టికెట్ రేట్లను పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో ఓజీకి కన్నడలో ఎదురైన వివాదాన్ని ఈ సందర్భంగా సినీ వర్గాలు గుర్తు చేశాయి. దీంతో ఆ గొడవపై తాజాగా పవన్ కల్యాణ్‌ స్పందించారు.

Read Also : Kantara 1 : బాయ్ కాట్ కాంతార1 అంటున్న తెలుగు యూత్.. ఎవరూ పట్టించుకోరా

బెంగుళూరులో జరిగిన వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కాంతార1కు ప్రోత్సాహాన్ని ఆపొద్దు. అక్కడ జరిగిన దాంతో.. ఇక్కడ నిర్ణయాలను పోల్చొద్దు. మన సినిమాలకు కర్ణాటకలో ప్రోత్సాహకాలు అందట్లేదనే విషయంపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై రెండు ఇండస్ట్రీల ఫిల్మ్ ఛాంబర్లు కూర్చుని మాట్లాడుకోవాలి. సినీ పరిశ్రమ బాగా ఎదుగుతోంది. ఇలాంటి టైమ్ లో సంకుచిత భావం ఉండొద్దు. జాతీయ భావంతోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ పరిణామాలపై ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తా’ అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్‌.

Read Also : Srinidhi Shetty : సాయిపల్లవిపై శ్రీనిధి శెట్టి ఊహించని కామెంట్స్

Exit mobile version