NTV Telugu Site icon

Sankranthi : నిజమేనా.. పవన్ vs ప్రభాస్..?

Sankranti Spl

Sankranti Spl

గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్.. ఈ సారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడబోతున్నారనే వార్త.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పవర్ స్టార్ ప్రస్తుతం.. క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ప‌వ‌ర్ స్టార్ రాబిన్ హుడ్ త‌ర‌హా బందిపోటు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. దాంతో పవన్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌న‌టువంటి పాత్ర కాబ‌ట్టి.. ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ మూవీని ముందుగా ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయబోతున్నట్టు తెలిసింది. కానీ ఇప్పుడు.. వి.ఎఫ్‌.ఎక్స్ కారణంగా ఈ మూవీ మరింత ఆలస్యం కానుందట. దాంతో ‘హరిహర వీరమల్లు’ను వ‌చ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలోకి దింపాల‌ని భావిస్తున్నారట మేకర్స్.

అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతికి ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని.. 2డీ తో పాటు త్రీడీ ఫార్మాట్‌లో.. అత్యంత భారీ స్థాయిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. టి సిరీస్ ఫిల్మ్స్, రెట్రో ఫైల్స్ సంస్థలపై.. భూషణ్ కుమార్, ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కృతి సనన్ సీతగా.. ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కావడంతో.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన కార్యక్రమాలు జరుపుకుంటోంది. రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆదిపురుష్ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పడు ఈ మూవీతో సంక్రాంతి వార్‌కి పవర్ స్టార్ రంగంలోకి దిగబోతున్నాడని వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియదు గానీ.. ఒకవేళ ఈ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే మాత్రం.. రసవత్తర పోటీ వుంటుందని చెప్పొచ్చు. అయితే అలా జరిగే ఛాన్సెస్‌ చాలా తక్కువని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఏదేమైనా ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారిపోయింది.

Show comments