NTV Telugu Site icon

ఎట్టకేలకు ‘హరిహర వీరమల్లు’పై దృష్టి పెట్టిన పవన్

Pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరి హర వీరమల్లు” సినిమా మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఎట్టకేలకు పవన్ ఈ సినిమాపై దృష్టి పెట్టాడు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను పునఃప్రారంభించనుంది. నెక్స్ట్ షెడ్యూల్ గురించి చర్చించడానికి దర్శకుడితో సహా మేకర్స్ పవర్‌ స్టార్‌ను కలిశారు. అతి త్వరలో కొత్త షెడ్యూల్ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో ప్రారంభం కానుంది. దర్శకుడు స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసి, నిన్న జరిగిన సెషన్‌లో పవన్ కు వివరించాడు. నిర్మాత ఏఎమ్ రత్నం తదితరులు స్క్రిప్ట్ రీడింగ్ సెషన్స్‌లో పాల్గొన్నారు.

Read Also : సమతా మూర్తి విగ్రహాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్

ఈ చిత్రం 50 శాతం షూటింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసుకుంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ కారణంగా మిగిలిన భాగం ఆగిపోయింది. ఇప్పుడు ఆ మిగిలిన షూటింగ్ ను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ పాన్-ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్ వారు నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. మరోవైపు పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.