NTV Telugu Site icon

Pawan Kalyan: OG అయిపోయింది… ఇక వీరమల్లుడిగా మారనున్నాడు

Pawan Kalyan

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకి మధ్య గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్నాడు. ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ లోకి వెళ్ళిపోతున్న పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా OG ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశాడు. పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ సుజిత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ‘OG’. ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా ‘పవన్ కళ్యాణ్’ని చూపిస్తూ ముంబై బ్యాక్ డ్రాప్ లో జరిగే మాఫియా కథతో OG సినిమా రూపొందుతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటివలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ముంబైలో జరిగిన ఈ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో మేకర్స్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ రేజ్(ఆపలేని ఆవేశం అని అర్ధం)ని తెరపై చూస్తారు అంటూ డీవీవీ ఎంటర్టైన్మెంట్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ వచ్చింది. సెప్టెంబర్ 2న OG నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకి వచ్చే ఛాన్స్ ఉంది.

OG ముంబై షెడ్యూల్ అయిపోవడంతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు పీరియాడిక్ హీరోగా మారిపోవడానికి రెడీ అయ్యాడు. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఎపిక్ వార్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ జాయిన్ అవ్వనున్నాడు. ఎప్పటినుంచో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ షూటింగ్ ఈ పాటికి ఎప్పుడో కంప్లీట్ అవ్వల్సింది కానీ అనివార్య కారణాల వలన డిలే అవుతూ వచ్చింది. అసలు ఈ సినిమా ఎంతవరకు షూట్ చేశారు? ఎంత బాలన్స్ ఉంది? రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇలాంటి ఏ విషయంపైనా ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాల్లో పూర్తిగా లోఫేజ్ లో ఉన్న సినిమా హరిహర వీరమల్లు మాత్రమే. మరి ఈ ప్రాజెక్ట్ పై ఉన్న ఎన్నో అనుమానాలని క్రిష్ ఎలా క్లియర్ చేస్తాడో చూడాలి.

Show comments