Site icon NTV Telugu

Pawan Kalyan: ఈ కాంబోలో సినిమానా? అది అవ్వదమ్మా…

Pawan Kalyan

Pawan Kalyan

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని ఊహించని కాంబినేషన్స్ గురించి వార్తలు బయటకి వచ్చి అందరికీ షాక్ ఇస్తాయి. అలాంటివి నిజమో కాదో ఆలోచించకుండా సెట్ అయితే బాగుంటుంది అనే ఆలోచనతో ఫాన్స్ ఆ న్యూస్‌ ని క్షణాల్లో వైరల్‌ చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటిదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో.. అరె మావా ఇదేం కాంబినేషన్.. ఒకవేళ ఈ కాంబో సెట్ అయితే స్క్రీన్స్ ఉంటాయా? అని మాట్లాడుకుంటున్నారు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసాడు లోకేష్ కనగరాజ్. నైట్ ఎఫెక్ట్ లో జరిగే గ్యాంగ్ స్టర్ డ్రామాలకి లోకేష్ ఒక యూనివర్స్ నే క్రియేట్ చేసాడు. ప్రస్తుతం విజయ్‌తో ‘లియో’ అనే సినిమా చేస్తున్న లోకేష్… ఆ తర్వాత ఖైదీ 2, విక్రమ్ 3 సినిమాలు చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ కన్నా ముందు రజినీకాంత్ తో లోకేష్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం.

బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్ తో లోకేష్ కనగరాజ్ బిజీగా ఉన్నాడు, ఇలాంటి సమయంలో పవన్ తో సినిమా చెయ్యడానికి ఓకే చెప్పేశాడనే రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుందని, పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉండే అవకాశమే లేదు ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కంప్లీట్ అవగానే పూర్తి స్థాయిలో పొలిటికల్‌గా బిజీ కానున్నాడు. 2024 ఎన్నికల వేడి తగ్గే వరకూ పవన్ కొత్త సినిమాలకి సైన్ చెయ్యడు. ఎన్నికల్లో ఫలితాలని బట్టి పవన్ కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత లోకేష్ ప్రాజెక్ట్ ఉంటుందేమో కానీ ఇప్పట్లో అయితే ఉండే అవకాశమే లేదు.

Exit mobile version