Pawan Kalyan: చిరు చరణ్ మధ్యలో పవన్… ఇన్ని ఫొటోల్లో ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఈ ఫోటో ఇచ్చింది

Pawan Kalyan

Pawan Kalyan

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పటికే వరుణ్ తేజ్-లావణ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ నుంచి ఎన్ని ఫోటోలు బయటకు వచ్చినా ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఒక్క ఫోటో ఇస్తుంది మెగా ఫ్యాన్స్ కి… ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి… కొత్త జంటతో మెగా అల్లు హీరోలు కలిసి దిగిన ఫోటోని చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఇందులో చిరు, చరణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు, అల్లు అర్జున్, శిరీష్ లతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు.

Read Also: Vikram: శివపుత్రుడు లానే తంగలాన్ లో కూడా నాకు డైలాగ్స్ ఉండవు

×
×
Ad

ఈ ఫోటోలో ఉన్న అందరూ ట్రెడిషనల్ డ్రెస్ లో ఉండగా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పెషల్ గా ఉన్నాడు. చిరు, చరణ్ మధ్యలో టీషర్ట్ లో పవన్ కళ్యాణ్ ఉండడం ఫోటోని మరింత స్పెషల్ గా మార్చింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లి పనులు మొదలయ్యినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫోటో కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. పవన్ ఫోటో ఒక్కటి పోస్ట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో మెసేజ్ ఫ్యాన్స్ పోస్టులు కూడా పెట్టారు. అభిమానుల కోరిక తీరుస్తూ ఇప్పుడు ఈ గ్రూప్ ఫోటో బయటకి వచ్చింది.